మంగళవారం 11 ఆగస్టు 2020
Vikarabad - Feb 16, 2020 , 00:01:32

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే గిరిజనులకు గుర్తింపు

 టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే గిరిజనులకు గుర్తింపు

 కొడంగల్‌, నమస్తే తెలంగాణ :  గిరిజనులు కష్టపడి నేడు ఉన్నత స్థానంలో నిలిచారని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం శ్రీ సద్గురు సంత్‌ సేవాలాల్‌ బహరాజ్‌ జయంతిని పురస్కరించుకొని పట్టణ శివారులోని సిద్దినాంపు మిషన్‌ భగీరథ సంప్‌హౌస్‌ వద్ద పెద్ద ఎత్తున ఉత్సవాన్ని నిర్వహించారు. ముందుగా ఉత్సవాల్లో భాగంగా పట్టణంలో గిరిజనులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొన్న వారు మాట్లాడుతూ గిరిజనులు స్వతహాగా కష్టపడి జీవించే గుణం ఉందన్నారు. అందువల్లే నేడు అన్ని రంగాల్లో వారు ముందంజలో ఉన్నారని తెలిపారు. నేడు వారిలో ఐక్యత ఏర్పడి జాతి అభ్యున్నతి పాటుపడుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత గిరిజనులను సీఎం కేసీఆర్‌ గుర్తించే విధంగా వారు ఆరాధ్యదైవంగా కొలుచుకునే సద్గురు సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించడం విశేషంగా పేర్కొన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించేందుకు ముందుకు రాలేదన్నారు.  గిరిజనులు వెలుగులోకి రావచ్చేందుకు సేవాలాల్‌ మహరాజ్‌ జాతిని జాగృతి పరిచారన్నారు.  నేడు ప్రతి గ్రామంలో సేవాలాల్‌ ఆలయాల నిర్మాణాలను చేపట్టి కొలుచుకొంటున్నారని తెలిపారు. ఇందులో భాగంగా పట్టణ ప్రాంతంలో సేవాలాల్‌ ఆలయ నిర్మాణానికి తమ వంతు పూర్తి సహకారాన్ని అందిస్తామని పేర్కొన్నారు. బంజార భవన నిర్మానానికి ప్రత్యేకంగా రూ.50 లక్షలు మంజూరు చేసే విధంగా ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్లు తెలిపారు.


అదేవిధంగా గిరిజన నేతలు మాట్లాడుతూ గిరిజనులను గుర్తించిన ప్రభుత్వం కేవలం టీఆర్‌ఎస్‌గా పేర్కొన్నారు. నేడు  గిరిజనులకు ఆర్థిక సహాయాన్ని అందించి సేవాలాల్‌ను కొలుచుకునేందుకు ప్రోత్సాహాన్ని అందించడంపై సీఎం కేసీఆర్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఆలయ నిర్మాణానికి స్థలాన్ని  కేటాయించడంతో పాటు   నిధుల మంజూరుకు ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి కృషి ఎంతో ఉందని, ఆయన వెంట ఎల్లప్పుడూ ఉంటామని గిరిజనులు   హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయా స్థానాలకు ఎన్నికైన గిరిజన నాయకులను ప్రత్యేకంగా సన్మానించారు. ఉత్సవాల్లో భాగంగా భోగ్‌ భండార్‌ కార్యక్రమంలో సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించారు.  కార్యక్రమంలో ఎంపీపీలు ముద్దప్ప దేశ్‌ముఖ్‌, హేమీబాయి, జడ్పీటీసీ రేణుదేశు, మాజీఎంపీపీ గోపీనాయక్‌, ప్రోగ్రాం అధికారి హన్మంత్‌రావు, సేవాలాల్‌ సేవా సంఘం గౌరవ అధ్యక్షుడు టీటీ రామునాయక్‌,  నియోజకవర్గ అధ్యక్షుడు దేశ్యానాయక్‌, ఉపాధ్యక్షులు రామునాయక్‌, అనిల్‌ నాయక్‌తో పాటు సీత్యానాయక్‌, మున్సిపల్‌ కౌన్సిలర్లు మధుసూదన్‌యాదవ్‌, శంకర్‌నాయక్‌తో పాటు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, గిరిజన నాయకులు పాల్గొన్నారు. 


logo