శుక్రవారం 29 మే 2020
Vikarabad - Feb 15, 2020 , 23:53:41

బైక్‌ను ఢీకొట్టిన వాహనం: ఉపాధ్యాయుడి మృతి

బైక్‌ను ఢీకొట్టిన వాహనం:   ఉపాధ్యాయుడి మృతి
  • మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే

పరిగి రూరల్‌ : ముందు వెళ్తున్న బైక్‌ను ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో  ఉపాధ్యాయుడు మృతిచెందాడు. ఈ ఘటన పరిగి మండలంలోని లక్ష్మీదేవిపల్లి స్టేజీ వద్ద శనివారం మధ్యాహ్నం జరిగింది. దోమ మండలం దొంగయెన్కెపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న శంకర్‌ (45) శనివారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో బైక్‌పై పరిగికి వస్తున్నాడు.  వెనకాల నుంచి వచ్చిన కర్ణాటకకు చెందిన ట్రక్కు లక్ష్మీదేవిపల్లి స్టేజీ వద్ద బైక్‌ను  ఢీకొట్టింది. ఈ సంఘటనలో బైక్‌పై నుంచి ఎగిరి కింద పడిపోయిన శంకర్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రధానోపాధ్యాయుడు శంకర్‌ మృతి చెందిన విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పరిగిలోని ప్రభుత్వ దవాఖానకు చేరుకొని, శంకర్‌ మృతహానికి నివాళులు అర్పించారు. పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పరిగిలోని టీచర్స్‌కాలనీలో మృతుడు శంకర్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు.  


logo