శనివారం 08 ఆగస్టు 2020
Vikarabad - Feb 14, 2020 , 23:41:35

సహకార ఎన్నికలకు సర్వం సిద్ధం

సహకార ఎన్నికలకు సర్వం సిద్ధం
  • నేడు పోలింగ్‌...ఫలితాలు
  • ఓటు వేయనున్న 26,659 మంది రైతులు
  • భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు
  • ఎన్నికల విధుల్లో 225 మంది సిబ్బంది
  • ఉదయం 7 నుంచి మ.1 గంట వరకు పోలింగ్‌
  • కేంద్రాలకు చేరిన ఎన్నికల సామగ్రి
  • ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు సంబంధించి నేడు జరగనున్న ఎన్నికలకు జిల్లా సహకార అధికారులు సర్వం సిద్ధం చేశారు. జిల్లా సహకార సంఘం అధికారి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఎన్నికల అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. నియోజకవర్గ పరిధిలోని 10 సహకార సంఘాల్లోని 130 వార్డులకు గాను  55 వార్డులు ఏకగీవ్రం అయిన విషయం తెలిసిందే. ఇక మిగిలిపోయిన 75 వార్డుల ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. డీసీవో, సిబ్బంది మొత్తం ఎన్నికలకు సంబంధించిన సామగ్రిని శుక్రవారం పట్టణంలోని మేరి నాట్స్‌ స్కూల్‌ ఆవరణలో ఎన్నికల సిబ్బందికి పంపిణీ చేశారు. ఎన్నికల సామగ్రి పంపిణీ కోసం ఆరు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉద యం నుంచి ఎన్నికల సిబ్బందికి బ్యా లెట్‌ బాక్సులు, ఎన్నికల సామగ్రిని అందించారు. ఎన్నికల సామగ్రి పం పిణీ ప్రక్రియను ఆర్డీవో ఉపేందర్‌రెడ్డి పరిశీలించారు. నియోజకవర్గంలోని 75 వార్డులకు ఒక్కొక్కటి చొప్పున మొత్తం 75 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్‌లో 26, 659 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఒక్కో పోలింగ్‌ కేంద్రానికి ఒక పీవో, ఒక ఏపీవో, ఒక వోపీవో లు మొత్తంగా 225 మంది సిబ్బందిని నియమించారు. పోలింగ్‌ ఉదయం 7 గంటల నుం చి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. వార్డుల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల ఏజెంట్లను నియమించుకుంటారు. పోలింగ్‌ జరిగిన చోటే ఓట్ల లెక్కింపు కూడా జరుగుతుంది. ఎన్నికైన డైరెక్టర్లకు ఈసారి ప్రత్యేకంగా ధ్రువీకరణ పత్రం ఇవ్వనున్నారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తారు. ఆ మరుసటి రోజు సంఘంలో అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక నిర్వహిస్తారు. నియోజకవర్గంలోని పలు పోలింగ్‌ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ నారాయణ, డీఎస్పీ సంజీవరావులు పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 


పుల్వామా అమరులకు నివాళి

పుల్వామా దాడిలో అమరులైన వీర జవాన్లకు ఎన్నికల పంపిణీ కేంద్రం వద్ద అధికారులు నివాళులర్పించారు. ఆర్డీవో ఉపేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో అధికారులందరూ రెండు నిమిషాలు పాటు మౌనం పాటించి నివాళులర్పించారు.


logo