శుక్రవారం 07 ఆగస్టు 2020
Vikarabad - Feb 14, 2020 , 23:41:35

అమరులైన వీర జవాన్లకు నివాళి

అమరులైన వీర జవాన్లకు నివాళి


జోన్‌ బృందం : పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో భారత్‌కు చెందిన 40 మంది సైనికులు వీరమరణం పొందారు. వారిని స్మరిస్తూ శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాల, కళాశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, రాజకీయ పార్టీల నేతలు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు వీర జవాన్ల ఆత్మకు శాంతి కలుగాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. వీర జవాన్లను స్మరిస్తూ సెల్యూట్‌ చేసి దేశభక్తిని చాటుకున్నారు. దేశానికి కాపాడేందుకు కుటుంబాలను, బంధాలను వదిలి సరిహద్దుల్లో రాత్రి, పగలు కంటిపై కునుకు లేకుండా కాపలా కాస్తూ అనుక్షణం దేశ భద్రతకు పాటుపడుతున్నారన్నారు. వారి త్యాగాలు వృథా కాకుండా వారిని స్మరిస్తూ అడుగు జాడల్లో నడువాలన్నారు. మీరు కూడా దేశానికి సేవ చేసే విధంగా తయారు కావాలని విద్యార్థులకు ఉపాధ్యాయులు సూచించారు. 


logo