ఆదివారం 09 ఆగస్టు 2020
Vikarabad - Feb 14, 2020 , 23:38:05

టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలి

టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలి
  • అధికార పార్టీ వ్యక్తులను గెలిపిస్తే అభివృద్ధి సాధ్యం
  • బంట్వారం మండల కార్యకర్తలతో సమావేశం
  • ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌

బంట్వారం : బంట్వారం మండలం అంటే ఎంతో వెనుకబడి ఉందని, దీనిని చూస్తే ఎందుకు అభివృద్ధి చెందలేదని బాధిస్తుందని ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని సుధాకర్‌గౌడ్‌ ఫంక్షన్‌ హాల్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ మండల నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు జరుగబోయే సహకార ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ మద్దతుదారులను గెలింపించాలని సూచించారు. ఇప్పటి వరకు సుమారు పాతికేండ్లుగా మండలంలో పాలకవర్గాన్ని, ప్రతిపక్ష పార్టీలవే కావడంతో సరైన అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఎంపీపీలు, జడ్పీటీసీలు అధికార పార్టీకి చెందిన వారు ఉంటే అధిక మొత్తంలో నిధులు తెచ్చి అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందన్నారు. అలా కాకుండా ఇతర ప్రతిపక్ష పార్టీలు ఉంటే సరైన నిధులు రాక, కేవలం ప్రభుత్వ నిధులతోనే అభివృద్ధి పనులు చేసుకోవాల్సి వస్తుందన్నారు. దీంతో చాలీచాలని నిధులతో, సరిపడా నిధులు లేక అభివృద్ధి కుంటుపడుతుందని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా రైతులు ఈ సంఘం ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ మద్దతుదారులను గెలిపిస్తే అధిక మొత్తంలో నిధులను ఇచ్చి ఈ మండలాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీటీసీ పద్మ, మాజీ ఎంపీపీ రాములు, సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడు వెంకటేశ్‌ యాదవ్‌, మాజీ ఎంపీటీసీ ప్రవీణ్‌, నాయకులు, అభ్యర్థులు రామచంద్రారెడ్డి, సుధాకర్‌గౌడ్‌, సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సహకార ఎన్నికల్లో విజయం టీఆర్‌ఎస్‌దే...

కోట్‌పల్లి : సహకార సంఘం ఎన్నికల్లో విజయఢంకా మోగించాలని ఎమ్మెల్యే ఆనంద్‌ అన్నారు. మండల పరిధిలోని బార్వాద్‌ గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ గడిచిన ఎన్నికల్లో అనుకున్నంత భారీ ఎత్తున విజయం సాధించుకున్నామని, అదేవిధంగా ఈ సారి కూడా అధిక మెజార్టీ సాధించాలని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో అన్ని డెరెక్టర్ల స్థానాలను గెలిపించుకుని సొసైటీలో టీఆర్‌ఎస్‌ జెండాను ఎగురవేయాలన్నారు. సొసైటీ చైర్మన్‌ అభ్యర్థి రామచంద్రారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు అనిల్‌కుమార్‌, సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడు వెంకటేశ్‌యాదవ్‌, అభ్యర్థులు రామచంద్రారెడ్డి, లక్ష్మి, వెంకట్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు.


logo