శుక్రవారం 14 ఆగస్టు 2020
Vikarabad - Feb 14, 2020 , 00:02:13

మంత్రి సబితారెడ్డికి పంచాయతీరాజ్‌ సమ్మేళన్‌ బాధ్యత

మంత్రి సబితారెడ్డికి   పంచాయతీరాజ్‌  సమ్మేళన్‌ బాధ్యత
  • వికారాబాద్‌, రంగారెడ్డి జిల్లాలకు ఇన్‌చార్జిగా..

వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పదిహేను రోజుల్లో జిల్లాస్థాయి లో పంచాయతీరాజ్‌ సమ్మేళన్‌ను నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్‌ సమ్మేళన్‌ను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తొంది. ఆయా జిల్లాలకు పల్లెప్రగతి పర్యవేక్షణ బాధ్యతలను మంత్రులకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


దీంతో వికారాబాద్‌, రంగారెడ్డి జిల్లాలకు విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డికి బాధ్యతలు అప్పగించారు. పదిహేను రోజుల్లోగా పంచాయతీరాజ్‌ సమ్మేళన్‌ను పూర్తి చేయాలని ఆదేశించింది. జిల్లా స్థాయిలో నిర్వహించే పంచాయతీరాజ్‌ సమ్మేళన్‌కు ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్‌పర్సన్‌, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులను, అధికారులను ఆహ్వానించనున్నారు. జిల్లాస్థాయి సమ్మేళన్‌లో నూతన పంచాయతీరాజ్‌ చట్టంతోపాటు నూతన మున్సిపల్‌ చట్టంపై అవగాహన కల్పించనున్నారు. 


logo