సోమవారం 10 ఆగస్టు 2020
Vikarabad - Feb 14, 2020 , 00:02:12

ప్రభుత్వ పథకాలే అభ్యర్థులను గెలిపిస్తాయి

ప్రభుత్వ పథకాలే అభ్యర్థులను గెలిపిస్తాయి

మర్పల్లి : తెలంగాణ రాష్ట్రంలో రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ పెద్దపీట వేయడం జరుగుతుందని, టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకొని సంఘాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కొండల్‌రెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని రావులపల్లి, పెద్దాపూర్‌, కల్‌కోడా, షాపూర్‌, దామస్తాపూర్‌, బూచన్‌పల్లి తదితర గ్రామాల్లో ప్రాథమిక సహకార సం ఘం ఎన్నికల్లో భాగంగా టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటికీ తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా రైతులకు 24గంటల విద్యుత్‌ అందించడం జరుగుతుందన్నారు. పంటపెట్టుబడి కోసం ఎకరాకు రెండు పంటలకు రూ. 10వేలు అందించడంతో పాటు గుంట భూ మి ఉన్న రైతుకు బీమా సౌకర్యం కల్పించి బీమా డబ్బులు ప్రభుత్వ మే చెల్లించడం జరుగుతుందన్నారు. రైతు ఏ విధం గా మరణించిన నామినీ ఖాతాలో రూ. 5లక్ష లు నేరుగా జమ అవుతున్నాయన్నారు.


ప్రస్తుతం జరుగుతున్న ప్రాథమిక సహకార సంఘం ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరపు అభ్యర్థులను గెలిపించుకొని సంఘా న్ని మరింత అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. అందుకు ప్రతి ఒక్క సంఘం సభ్యుడు టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేసి అన్ని స్థానాలను గెలిపించుకుందామన్నారు. మర్పల్లి సహకార సంఘంతో పాటు జిల్లాలోని అన్ని స్థానాల్లో టీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మధుకర్‌, వైస్‌ ఎంపీపీ మోహన్‌రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు సురేశ్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి, బట్టు రమేశ్‌, మాజీ వైస్‌ ఎంపీపీ అంజయ్యగౌడ్‌, మాజీ సర్పంచ్‌ గోపాల్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, డైరెక్టర్‌ అభ్యర్థులు, సంఘం సభ్యులు పాల్గొన్నారు.


logo