మంగళవారం 11 ఆగస్టు 2020
Vikarabad - Feb 13, 2020 , 23:59:49

సంఘాల్లో టీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేయడం ఖాయం

సంఘాల్లో టీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేయడం ఖాయం
  • అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించండి
  • మండలంలోని పలు గ్రామాల్లో పర్యటన
  • ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌

ధారూరు : రెండు సహకార సంఘాల్లో ఘన విజయం సాధిస్తారని, సొసైటీల్లో టీఆర్‌ఎస్‌ జెండా ఎగుర వేయడం ఖాయమని ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ అన్నారు. గు రువారం మండల పరిధిలోని అంతారం, మోమిన్‌కలాన్‌, నాగారం, దోర్నాల్‌, తరిగోపుల గ్రామాల్లో సహకార ఎన్నికల్లో భాగంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ధారూరు పీఏసీఎస్‌లో ముగ్గురు డైరెక్టర్లును ఏకగ్రీవం చేసుకున్నామని పేర్కొన్నారు. శనివారం జరుగబోయే సొసైటీ ఎన్నికల్లో 10 డైరెక్టర్ల స్థానాలను కూడా టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోబోతున్నామన్నారు. హరిదాస్‌పల్లి పీఏసీఎస్‌లో 12 డైరెక్టర్లు ఏకగ్రీవం కాగా ఒక స్థానం డైరెక్టర్‌ టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోబోతుందన్నారు. రైతులు టీఆర్‌ఎస్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు కె.వేణుగోపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి యూను స్‌, టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులు సత్యనారాయణరెడ్డి, లింగారెడ్డి, రాజునాయక్‌, నాయకులు హన్మంత్‌రెడ్డి, రాజుగుప్తా, శ్రీపతిరెడ్డి పాల్గొన్నారు.

జోరుగా సహకార ఎన్నికల ప్రచారం

వికారాబాద్‌ రూరల్‌ : ఈ నెల 15న జరుగబోయే సహకార సంఘం ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగింది. మండల పరిధిలోని చిట్టంపల్లి, గొట్టిముక్కల, ధన్నారం గ్రామాల్లో పార్టీ అభ్యర్థుల తరఫున నాయకులు ప్రచారం చేశారు. ఈ సందర్భంగా రైతు సమన్వయ సమితి సభ్యుడు, 15వ వార్డు కౌన్సిలర్‌ అనంత్‌రెడ్డి మాట్లాడుతూ రైతుల ప్రభుత్వం అధికారంలో ఉం ది కాబట్టి, అధికార పార్టీ బలపర్చిన అభ్యర్థికి ఓటు వేసి గెలిపించుకోవాలని పేర్కొన్నారు. రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, పెట్టుబడులు, పంట రుణాలు సకాలంలో అందించి రైతులకు అండగా నిలుస్తుందన్నారు. అధికార పార్టీ బలపర్చిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని రైతు ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ గోపాల్‌, మండల నాయకులు సాయికృష్ణగౌడ్‌, సుభాన్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, లాలయ్య, పాండు ముదిరాజ్‌, కార్యకర్తలు పాల్గొన్నారు. 

గులాబీ మద్దతుదారులదే విజయం

బంట్వారం : మండలంలో జరుగుతున్న సహకార ఎన్నికల్లో గులాబీ మద్దతుదారులదే విజయం అని టీఆర్‌ఎస్‌ పా ర్టీ మండల అధ్యక్షుడు కె.శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంతో పాటు, తొరుమామిడి, రొంపల్లి, సల్బత్తాపూర్‌ తదితర గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థులు సంఘం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందజేస్తున్న పథకాలతో రైతులంతా టీఆర్‌ఎస్‌ వైపే ఉన్నారని పేర్కొన్నారు. రైతుల సంక్షేమాన్ని ఆకాంక్షించేది తెరాస ప్రభుత్వమేనన్నా రు. 13 డైరెక్టర్లకు గాను ఇప్పటికే రెండు ఏకగ్రీవం చేసుకోవడం జరిగిందన్నారు. మిగిలిన 11 వార్డుల్లో తమ అభ్యర్థు లు ప్రచారం నిర్వహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అభ్యర్థులను గెలిపించాలని రైతులను కోరారు. కా ర్యక్రమంలో మండల నాయకుడు వెంకటయ్య, సర్పంచ్‌ల సంఘం మం డల అధ్యక్షుడు నర్సింహుల పాల్గొన్నారు.    

ప్రజల నుంచి స్పందన

నవాబుపేట : సహకార సంఘం ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి మిశ్రమ స్పందన లభిస్తున్నదని వైస్‌ ఎంపీపీ బందయ్యగౌడ్‌ అన్నారు. మండల పరిధిలోని అక్నాపూర్‌ గ్రామంలో అభ్యర్థి దయాకర్‌రెడ్డితో కలిసి ఆయన ఇంటింటికీ తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల పక్షపాతిగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో రైతుల నుంచి మంచి అధరణ లభిస్తున్నదని చెప్పారు. తప్పకుండా టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు విజయం సాధిస్తారన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ సుధాకర్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.


logo