శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Vikarabad - Feb 12, 2020 , 23:49:28

అన్ని ‘సొసైటీ’ల్లో గెలుపు ఖాయం

అన్ని ‘సొసైటీ’ల్లో గెలుపు ఖాయం
  • ప్రభుత్వ పథకాలతో రైతులకు ఎంతో మేలు
  • పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే
  • వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌
  • టీఆర్‌ఎస్‌లో చేరిన మోమిన్‌పేట మండల కాంగ్రెస్‌ నాయకులు

మోమిన్‌పేట: అన్ని పీఏసీఎస్‌ సొసైటీలలో టీఆర్‌ఎస్‌  విజయం సాధించడం ఖాయమని వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ పేర్కొన్నారు. బుధవారం వికారాబాద్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మోమిన్‌పేట ఎంపీపీ వసంత వెంకట్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆనంద్‌ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీ మండల నాయకులు దాదాపు 60 మంది టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే ఆనంద్‌ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలు రైతులకు ఎంతో అండగా నిలుస్తున్నాయన్నారు. జరుగబోయే పీఏసీఎస్‌ సొసైటీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు. అభివృద్ధి పర్చే నాయకులను ఎంచుకొని వారిని గెలిపించాలన్నారు. పార్టీలో చేరిన వారు మోమిన్‌పేట మండల కాంగ్రెస్‌ యూత్‌ ప్రెసిడెంట్‌ సంగమేష్‌గుప్తా, మండల యూత్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మచ్చేందర్‌రెడ్డి, మోమిన్‌పేట టౌన్‌ కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌  మహిపాల్‌రెడ్డి, టౌన్‌ ప్రెసిడెంట్‌ రాజు, జనరల్‌ సెక్రటరీ అనూప్‌రెడ్డిలతో పాటు 60 మందికిపైగా కాంగ్రెస్‌ కార్యకర్తలు, పార్టీ యువజన నాయకులు చేరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ విజయ్‌కుమార్‌, డీసీఎంఎస్‌ మాజీ  చైర్మన్‌ నర్సింహులుగుప్తా, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.  


logo