శనివారం 15 ఆగస్టు 2020
Vikarabad - Feb 11, 2020 , 23:25:58

సహకార ఎన్నికల నిర్వహణకు సిబ్బందికి శిక్షణ

సహకార ఎన్నికల నిర్వహణకు సిబ్బందికి శిక్షణ

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : సహకార సం ఘాల ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా సహకార అధికారి లక్ష్మీనారాయణ సిబ్బందికి సూచించారు. మంగళవారం స్థానిక అంబేద్కర్‌ భవన్‌లో ఎన్నికల నిర్వహణపై పీవో, ఏపీవో, ఓపీవోలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. పోలింగ్‌ రోజు నిర్వహించాల్సిన విధులపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా డీసీవో లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఎన్నికల విధులు, ఓటరు గుర్తింపు, బ్యాలెట్‌ పేపర్‌, సిరా వాడకం, బ్యాలెట్‌ బాక్సుల సీలింగ్‌ వంటి వివరాల గురించి అవగాహన కల్పించామన్నారు. జిల్లా వ్యాప్తంగా 185వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. 


185వార్డులకు గాను 404 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారన్నారు. ఈ నెల 15న సహకార సంఘం ఎన్నికలు జరుగనుండ గా, 14న స్థానిక మేరినాట్‌ స్కూల్‌లో బ్యాలెట్‌ బాక్సు ల పంపిణీ ఉంటుందని, ఉదయం 10గంటలకు హాజ రై బ్యాలెట్‌ బాక్సులతో పాటు ఎన్నికల సామగ్రిని తీసుకుని సాయంత్రం వరకు పోలింగ్‌ కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఈ ఎన్నికలు ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని, మధ్యాహ్నం 2గంటల నుంచి కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. ఎన్నికల ఫలితాలు అదే రోజు ప్రకటిస్తామన్నారు. ఎన్నికల నిర్వహణలో 223పీవో, 223ఏపీవో, 223ఓపీవోలు పాల్గొంటారని ఆయన వివరించారు. కాగా ఉదయం నుంచి సాయంత్రం వరకు రెండు విడుతలుగా సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో సహకార సంఘం అధికారులు, సిబ్బంది, పీవో, ఏపీవో, ఓపీవోలు తదితరులు పాల్గొన్నారు.తాజావార్తలు


logo