శనివారం 15 ఆగస్టు 2020
Vikarabad - Feb 11, 2020 , 23:23:16

పంట రుణాల టార్గెట్‌ రూ. 603కోట్లు

పంట రుణాల టార్గెట్‌ రూ. 603కోట్లు

తాండూరు రూరల్‌ : 2019-20 ఆర్థిక సంవత్స రం పంట రుణాల టార్గెట్‌ రూ. 603కోట్లు రైతులకు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటి వరకు రూ. 175కోట్ల పం ట రుణాలు వివిధ బ్యాంకుల ద్వారా మంజూరు చేశామని లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ సుమలత పేర్కొన్నారు. మంగళవారం తాండూరు ఎంపీడీవో కార్యాలయం లో బ్యాంకు మేనేజర్లు, ఐకేపీ సిబ్బందితో రుణాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్థిక సంవత్సరం చివరిలోపు టార్గెట్‌ పూర్తి చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు. ఇప్పటి వరకు కేవలం 30శాతం రుణాలు మాత్రమే అందజేశామని తెలిపారు. 14 బ్యాంకులు తమ పరిధిలో ఉన్నాయ ని, ఆయా బ్యాంకు మేనేజర్లకు ఇచ్చిన టార్గెట్‌ పూర్తి చేసేందుకు కృషి చేయాలని తెలిపారు. ప్రధానంగా ఎస్‌బీఐ పంట రుణాల టార్గెట్‌ రూ. 69.46కోట్లు, ఆంధ్రాబ్యాంకు రూ. 40.04కోట్లు, టీజీబీ రూ. 42.25 కోట్లు, హెచ్‌డీసీబీ రూ.6.21 కోట్లు, కెనరా బ్యాంకు రూ. 3.78 కోట్లు, బ్యాంకు ఆఫ్‌ బరోడ రూ. 1.59 కోట్లు, కేజీబీ బ్యాంకు రూ. 5.47కోట్లు, ఏపీజీవీబీ రూ. 4.29 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రూ.3.23 కోట్లు, సిండికెట్‌ బ్యాంకు రూ. 8లక్షలు, ఐసీఐసీఐ బ్యాంకు 0.86లక్షల టార్గెట్‌ నిర్ణయించామన్నారు. మిగతా చిన్నచిన్న బ్యాం కులకు తక్కువ టార్గెట్‌ ఉందని ఆమె తెలిపారు. అదే విధంగా బ్యాం కుల నుంచి పొదుపు సంఘాలకు ఇచ్చిన రుణాలను సకాలంలో రికవరీ చేయాలని ఐకేపీ సిబ్బందికి సూచించారు. 


కొంతమంది మొండి బకాయి పడ్డారని ఐకేపీ సిబ్బంది, బ్యాంకు మేనేజర్లు సమావేశంలో తెలిపారు. మొండి బకాయి ఉన్న పొదు పు సంఘాల దగ్గరకు ఎంపీడీవో, ఐకేపీ సిబ్బంది, బ్యాంకు అధికారులు సంయుక్తగా వెళ్లి రుణాలు రికవరీ చేయాలని సూచించారు. డీఆర్‌డీవో అడిషన్‌ అధికారి బాలస్వామి మాట్లాడుతూ ఏపీవోలు ఆయా మండలాలకు నిర్ధేశించిన టార్గెట్‌ పూర్తి చేయాలని, బ్యాంకుల నుంచి పొదుపు సంఘాలకు ఇచ్చిన రుణాల రికవరీలో కూడా ముందుండాలని సూచించారు. మధ్యలో ఆగిపోయిన సంఘాలను మళ్లీ గాడిలో పెట్టేందుకు యత్నించాలని సూచించారు. ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు వచ్చినందున కచ్చితంగా ఆయా మండలల్లో టార్గెట్‌ రీచ్‌ కావాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పలు బ్యాంకు మేనేజర్లు, ఐకేపీ సిబ్బంది, తదితరులు ఉన్నారు.


logo