ఆదివారం 07 జూన్ 2020
Vikarabad - Feb 11, 2020 , 23:18:22

పెండింగ్‌ కేసులను త్వరగా పరిష్కరించాలి

పెండింగ్‌ కేసులను త్వరగా పరిష్కరించాలి

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : వాహనదారులు రోడ్డు భద్రత నియమాలను పాటించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ నారాయణ పోలీసులకు సూచించారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో  సమీక్షా సమావేశం నిర్వహించారు. రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ వంటి అంశాలపై సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో అడిగి తెలుసుకున్నారు. పోలీస్‌ స్టేషన్‌ల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రోజు వారీగా తనిఖీలు చేసే ప్రదేశాల్లో కాకుండా కొత్త ప్రదేశాల్లో గాని వివిధ గ్రామా ల నుంచి పట్టణాలకు వచ్చే వాహనాలను ముమ్మరంగా తనిఖీలు చేయాలని సూచించారు. ఆర్టీవో అధికారులతో కలిసి అన్ని రకాల వాహనాలను తనిఖీలు చేయాలని, అదే విధంగా వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు  పాటించేలా చూడాలన్నారు. మూ డు సంవత్సరాలుగా పోలీస్‌స్టేషన్‌లలో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలన్నారు. చిన్న చిన్న విషయాలకు కేసులు నమోదు చేయకుండా ఇరువర్గాలకు అవగాహన కల్పించి, 


అలాంటి కేసులను పెండింగ్‌లో లేకుండా చూడాలన్నారు. దొంగతనాల నివారణ కోసం పెట్రోలింగ్‌, బ్లూకోట్స్‌, సంబంధిత అధికారులు అందరూ కూడా పూర్తి బాధ్యతతో పని చేయాలని, ప్రతి ఒక్కరూ తమ పీఎస్‌ పరిధిలోని గ్రామాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అనంతరం అదనపు ఎస్పీ రశీద్‌ మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న నేరాలను నివారించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కేసులు పెండింగ్‌లో లేకుండా  చూడాలని పోలీస్‌ సిబ్బంది సూచించారు. కార్యక్రమంలో పరిగి, తాండూరు డీఎస్పీలు, వికారాబాద్‌, పరిగి, తాండూరు, ధారూరు, మోమిన్‌పేట్‌, మహిళ పీఎస్‌ సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.


logo