ఆదివారం 09 ఆగస్టు 2020
Vikarabad - Feb 11, 2020 , 00:06:25

101 వార్డులు ఏకగ్రీవం 404 మంది బరిలో..

101 వార్డులు ఏకగ్రీవం 404 మంది బరిలో..
  • 286కు 185వార్డులకు ఎన్నికలు
  • నామినేషన్లను ఉపసంహరించుకున్న 319మంది అభ్యర్థులు
  • ఐదు పీఏసీఎస్‌లు టీఆర్‌ఎస్‌ కైవసం
  • కులకచర్ల, హస్నాబాద్‌, ఎక్‌మామిడిలో 13 వార్డులు, పెద్దేముల్‌లో 8, కొత్తగడిలో 11వార్డులు టీఆర్‌ఎస్‌ ఏకగ్రీవం

వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలో 22 పీఏసీఎస్‌ల్లో 286 వార్డులుండగా 101వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 185వార్డులకు ఎన్నికలు జరుగనుండగా 404మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 824మంది నామినేషన్లు దాఖలు చేయగా 101వార్డులు ఏకగ్రీవం కాగా, మరో 319మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో 404మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ప్రాథమిక సహకార సంఘం ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ జోరు కొనసాగుతున్నది. జిల్లాలోని 22 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను కైవసం చేసుకునే దిశగా జిల్లా ఇన్‌చార్జి మంత్రి సబితాఇంద్రారెడ్డి, నాలుగు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు గెలుపు వ్యూహంతో ముందుకెళ్తున్నారు. ఇందులో భాగంగానే ఎమ్మెల్యేలు మహేశ్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, పైలట్‌ రోహిత్‌రెడ్డి, మెతుకు ఆనంద్‌ ఏకగ్రీవాలపై దృష్టి సారించారు. ఎన్నికలకు ముందే జిల్లాలో ఐదు పీఏసీఎస్‌లను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకున్నది. కులకచర్ల, హస్నాబాద్‌, ఎక్‌మామిడి, పెద్దేముల్‌ పీఏసీఎస్‌లను తన ఖాతాలో వేసుకున్నది. కాగా, ఈ నెల 15న ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్‌ జరుగనున్నది. అదేరోజు మధ్యాహ్నం 3గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టి అనంతరం అధికారులు ఫలితాలను ప్రకటించనున్నారు. 


సహకార ఎన్నికల్లోనూ అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ జోరు పెంచింది. జిల్లాలోని 22 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను కైవసం చేసుకునే దిశగా జిల్లా ఇన్‌చార్జి మంత్రి సబితారెడ్డి గెలుపు వ్యూహంతో నాలుగు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ముందుకెళ్తున్నారు. ఇందులో భాగంగానే ఎమ్మెల్యేలు కొప్పుల మహేశ్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, పైలట్‌ రోహిత్‌రెడ్డి, మెతుకు ఆనంద్‌లు ఏకగ్రీవాలపై ప్రధాన దృష్టి సారించారు. అయితే జిల్లాలో ఎన్నికలు జరుగకుండానే నాలుగు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకుంది. జిల్లాలోని కులకచర్ల పీఏసీఎస్‌తోపాటు హస్నాబాద్‌, ఎక్‌మామిడి, పెద్దేముల్‌ పీఏసీఎస్‌లను ఎన్నిక లేకుండానే టీఆర్‌ఎస్‌ పార్టీ తన ఖాతాలో వేసుకుంది. అయితే కులకచర్ల, కొడంగల్‌, ఎక్‌మామిడి సొసైటీల్లో 13 ప్రాదేశిక నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు ఏకగ్రీవంగా ఎన్నికవగా, కొత్తగడి సొసైటీలో 11, పెద్దేముల్‌ సొసైటీలో 8 ప్రాదేశిక నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరోవైపు ధారూర్‌ మండలంలోని హరిదాసుపల్లి సొసైటీలో 12 ప్రాదేశిక నియోజకవర్గాలు ఏకగ్రీవంకాగా ఒక ప్రాదేశిక నియోజకవర్గానికి ఎన్నిక జరుగనుంది. 


అయితే సంబంధిత సొసైటీలో టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు ఆరుగురు ఏకగ్రీవంగా ఎన్నికవడంతో ఎన్నిక ఉత్కంఠగా మారింది. ఈ సొసైటీ లే కాకుండా జిల్లాలోని మిగతా సొసైటీల్లోనూ టీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతుదారులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదేవిధంగా నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి రోజైన సోమవారం చాలా వరకు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. 


185 ప్రాదేశిక నియోజకవర్గాలకు ఎన్నికలు..

జిల్లాలో 22 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలుండగా 286 ప్రాదేశిక నియోజకవర్గాలున్నాయి. అయితే 101 ప్రాదేశిక నియోజకవర్గాల్లో ఎన్నికలు ఏకగ్రీవంకాగా మిగతా 185 ప్రాదేశిక నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగనున్నాయి. అయితే 185 ప్రాదేశిక నియోజకవర్గాలకుగాను 404 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అయితే జిల్లాలోని 22 సొసైటీలకు 824 మంది నామినేషన్లు దాఖలు చేయగా 101 ఏకగ్రీవంగా ఎన్నికవడం, మరో 319 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో 404 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. అయితే ఆయా సొసైటీల్లో ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు సంబంధించి.., శివారెడ్డిపేట సొసైటీలో 11 వార్డుల్లో 27 మంది అభ్యర్థులు, ధారూరు సొసైటీలో 10 వార్డుల్లో 21 మంది, హరిదాస్‌పల్లి సొసైటీలో 1 వార్డులో ఇద్దరు, వట్టి మీనపల్లి సొసైటీలో 10 వార్డుల్లో 29 మంది, పూడూరు సొసైటీలో 12 వార్డుల్లో 27 మంది, మోమిన్‌పేట సోసైటీలో 11 వార్డుల్లో 16 మంది, పెద్ద మర్పల్లి 13 వార్డుల్లో 26 మంది, మేకవనంపల్లి సొసైటీలోని 11 వార్డుల్లో 23 మంది, బంట్వారం సొసైటీలోని 11 వార్డుల్లో 24 మంది, ఎల్మకన్న సొసైటీలోని 10 వార్డుల్లో 20 మంది, యాలాల సొసైటీలోని 12 వార్డుల్లో 32 మంది, నావంగి సొసైటీలోని 12 వార్డుల్లో 24 మంది, తట్టెపల్లి సొసైటీలోని 13 వార్డుల్లో 27 మంది, దౌల్తాబాద్‌ సొసైటీలోని 11 వార్డుల్లో 25 మంది, పరిగి సొసైటీలోని 9 వార్డుల్లో 19 మంది, మోత్కుర్‌లోని 12 వార్డుల్లో 25 మంది, మెట్లకుంట సొసైటీలోని 12 వార్డుల్లో 25 మంది, కొత్తగడి సొసైటీలోని 2 వార్డుల్లో నలుగురు, పెద్దేముల్‌ సొసైటీలోని 4 వార్డుల్లో 9 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో పోటీ పడనున్నారు. 


అయితే నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు అధిక మొత్తంలో అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. అయితే జిల్లాలోని హస్నాబాద్‌, కులకచర్ల, ఎక్‌మామిడి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లోని 13 వార్డుల్లో ఎన్నిక ఏకగ్రీవం కాగా, మిగిలిన శివారెడ్డిపేట, ధారూరు, హరిదాస్‌పల్లి, వట్టి మీనపల్లి, పూడూరు, మోమిన్‌పేట, పెద్ద మర్పల్లి, మేకవనంపల్లి, బంట్వారం, ఎల్మకన్న, యాలాల, నావన్‌డ్గి, తట్టెపల్లి, దౌల్తాబాద్‌, పరిగిలో, మోత్కుర్‌లో, మెట్ల కుంట, కొత్తగడి, పెద్దేముల్‌లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లోని 185 ప్రాదేశిక నియోజకవర్గాలకు ఈనెల 15న  ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ జరుగనుంది. తదనంతరం అదేరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టి అనంతరం ఫలితాలను ప్రకటించనున్నారు. 


101 వార్డులు..

జిల్లాలోని 22 సొసైటీల్లోని 286 ప్రాదేశిక నియోజకవర్గాలకుగాను 101 ఎన్నిక ఏకగ్రీవమయ్యింది. అయితే కులకచర్ల, హస్నాబాద్‌, ఎక్‌మామిడి సొసైటీల్లోని ప్రాదేశిక నియోజకవర్గాలన్ని ఏకగ్రీవంకాగా, కొత్తగడి సొసైటీలో 11 ప్రాదేశిక నియోజకవర్గాలు, హరిదాసుపల్లి సొసైటీలో 12 ప్రాదేశిక నియోజకవర్గాలు, పెద్దేముల్‌ సొసైటీలో 9 ప్రాదేశిక నియోజకవర్గాలు, శివారెడ్డిపేట్‌లో 2, ధారూర్‌లో 3, పూడూరులో 1, వట్టిమీనపల్లిలో 2, పరిగిలో 4, మోమిన్‌పేట్‌లో 5, మేకవనంపల్లిలో 2, బంట్వారంలో 2, మోత్కూరులో 1, మెట్లకుంటలో 1, ఎల్మకన్నెలో 3, యాలాలలో 1, నవాంద్గిలో 1, దౌల్తాబాద్‌ సొసైటీలో రెండు ప్రాదేశిక నియోజకవర్గాల్లో ఎన్నిక ఏకగ్రీవమైంది. అయితే జిల్లాలోని తట్టేపల్లి, పెద్ద మర్పల్లి సొసైటీల్లో మాత్రం ఏకగ్రీవ ఎన్నిక జరుగలేదు. ప్రతి సొసైటీలో ఎన్నిక జరుగకుండా ఏకగ్రీవంగా తమ మద్దతుదారులను ఎన్నికయ్యే విధంగా టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రయత్నించింది. ఆయా సొసైటీల్లోని చాలా ప్రాదేశిక నియోజకవర్గాల్లో కేవలం నామినేషన్‌ మాత్రమే దాఖలు కావడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. అయితే ఏకగ్రీవంగా ఎన్నికైన సొసైటీల్లో సుమారు 90 ప్రాదేశిక నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 


logo