శనివారం 15 ఆగస్టు 2020
Vikarabad - Feb 10, 2020 , 23:58:11

సర్కారు పథకాలను అర్హులకు అందించాలి

సర్కారు పథకాలను అర్హులకు అందించాలి

కులకచర్ల: తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంపై దృష్టి సారించిందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కులకచర్ల మండల కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శేరి రాంరెడ్డి ఆధ్వర్యంలో వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి సమక్షంలో చేరారు. టీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో కులకచర్ల మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శేరి రాంరెడ్డి, రాంపూర్‌  సర్పంచ్‌ మంజుల, పీరంపల్లి బోట్యనాయక్‌తండా  సర్పంచ్‌ గంగాబాయి, కామునిపల్లి ఎంపీటీసీ చందన, పీరంపల్లి ఎంపీటీసీ రాజునాయక్‌, కులకచర్ల మండల కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు కనకం మొగులయ్య, మందిపాల్‌ కాంగ్రెస్‌ నాయకుడు బోగం యాదయ్య, కులకచర్ల సీనియర్‌ నాయకుడు నాగని బుచ్చయ్య, చౌడాపూర్‌కు చెందిన పరిగి అశోక్‌తో పాటు వివిధ గ్రామాలకు చెందిన వార్డు సభ్యులు, 50పైకి పైగాకాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటుందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు  నెరవేర్చేందుకు కృషిచేస్తుందని తెలిపారు. 


మనోహర్‌రెడ్డిని అభినందించిన ఎమ్మెల్యే 

కులకచర్ల మండలంలో పీఏసీఎస్‌ స్థానాలను అన్నింటినీ కైవసం చేసుకున్న టీఆర్‌ఎస్‌ పార్టీ చైర్మన్‌ అభ్యర్థి బుయ్యని మనోహర్‌రెడ్డి పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అభినందించారు. కులకచర్ల పీఏసీఎస్‌ను టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకోవడం పై పార్టీ నాయకులను అభినందించారు. జిల్లా స్థాయిలో కూడా డీసీసీబీ అధ్యక్షుడిగా ఎంపికయ్యే విధంగా తనవంతు కృషిచేస్తానని తెలిపారు.  కార్యక్రమంలో కులకచర్ల ఎంపీపీ సత్యమ్మ హరిశ్చంద్ర, జడ్పీటీసీ రాందాస్‌నాయక్‌, మండల రైతు సంఘం అధ్యక్షుడు పీరంపల్లి రాజు, ఏఎంసీ చైర్మన్‌ నర్సింహులు, మండల సీనియర్‌ టీఆర్‌ఎస్‌ నాయకులు సుధాకర్‌రెడ్డి, నాగరాజు, హరికృష్ణ, రాజప్ప, టీఆప్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు సారా శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి గుండుమల్ల నర్సింహులు, దామోదర్‌రెడ్డి, జిల్లా టీఆర్‌ఎస్‌ నాయకులుఎ అనిల్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. 


ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిక

బంట్వారం : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన పథకాలు నచ్చి కాంగ్రెస్‌ పార్టీ నాయకులు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నారని వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ తెలిపారు. సోమవారం వికారాబాద్‌ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ సమక్షంలో బంట్వారం మండలానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు గౌండ్ల సుధాకర్‌గౌడ్‌ టీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీలో చేరిన సుధాకర్‌గౌడ్‌కు టీఆర్‌ఎస్‌ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్‌ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు నాయకులు ఆకర్శితులై పార్టీలో చేరుతున్నారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌  మండలాధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, మాజీ ఎంపీపీ రాములుయాదవ్‌, నాయకులు బల్వంత్‌రెడ్డి, మల్లారెడ్డి, ఖాజపాషా, మల్లేశం ఉన్నారు. 


logo