గురువారం 04 జూన్ 2020
Vikarabad - Feb 09, 2020 , 23:41:44

అదుపుతప్పి పత్తి గింజల లారీ బోల్తా

అదుపుతప్పి పత్తి గింజల లారీ బోల్తా


పెద్దేముల్‌ : ప్రమాదవశాత్తు పత్తి గింజల లారీ అదుపుతప్పి బోల్తా కొట్టి న సంఘటన పెద్దేముల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు కథనం ప్రకారం.. పెద్దేము ల్‌ మండల పరిధిలోని మారేపల్లి గ్రా మ సమీపంలో ఉన్న సుమిత్రా కాటన్‌ మిల్‌లో ఆర్‌జె 23జిబి 5457 నెంబర్‌ గల లారీ పత్తి గింజల సంచుల లోడ్‌ను నింపుకొని మిల్‌లో నుంచి బయలుదేరింది. మలుపుతుండగా ప్రమాదవశాత్తు లారీ వెనుక భాగంలో ఉన్న కమాన్‌ పట్టి విరుగడంతో అదుపుతప్పి బోల్తా కొట్టగా అందులోని పత్తి గింజల సంచులు మొత్తం నెలపై పడ్డాయి. ప్రమాదం జరిగిన సమయంలో లారీలో డ్రైవర్‌ రతన్‌ సింగ్‌, క్లీనర్‌ గోకుల్‌ సింగ్‌ ఉండగా ఎవ్వరికి కూడా ఏలాంటి గాయాలు కాలేదు. లారీ పత్తి గింజల సంచులతో హర్యానాలోని కెతల్‌ కాట న్‌ కంపెనీకి వెళ్లా ల్సి ఉండగా ప్రమాదం జరిగింది. 


logo