సోమవారం 03 ఆగస్టు 2020
Vikarabad - Feb 09, 2020 , 00:05:25

లోక్‌ అదాలత్‌లో 38 కేసులు పరిష్కారం

లోక్‌ అదాలత్‌లో 38 కేసులు పరిష్కారం
  • జిల్లా అదనపు న్యాయమూర్తి మురళీమోహన్‌
  • జిల్లా వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో కేసుల పరిష్కారం
  • వికారాబాద్‌లో నాటికలతో ప్రజలకు అవగాహన కల్పించిన విద్యార్థులు

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : లోక్‌ అదాలత్‌లో ఎన్నో ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసులకు సత్వర పరిష్కారం జరుగుతుందని మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్‌, జిల్లా అదనపు న్యాయమూర్తి మురళీమోహన్‌ అన్నారు. శనివారం కోర్టు ఆవరణలో మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోక్‌ అదాలత్‌ను నిర్వహించారు. పట్టణంలోని మైనార్టీ రెసిడెన్షియల్‌ విద్యార్థులతో లోక్‌ అదాలత్‌ కేసుల పరిష్కారం పై నాటక ప్రదర్శన నిర్వహించి అవగాహన కల్పించారు. విద్యార్థులు నిర్వహించిన నాటికలో ఈ విద్యార్థుల నాటికల ప్రదర్శన అన్నదమ్ముల్లో ఆస్తి పంపకాల విషయమై భార్యాభర్తల తాగుడు గొడవలు, అప్పు తీసుకుని మోసం చేయడం వంటి కేసులను ఉదాహరణగా తీసుకుని నాటికలు ప్రదర్శించారు. 


ఈ సందర్బంగా జిల్లా అదనపు న్యాయమూర్తి మురళీమోహన్‌ మాట్లాడుతూ రకరకాల కారణాలతో కేసులు పెట్టుకుని కోర్టుల చుట్టూ తిరుగుతున్న వారికి ఈ లోక్‌ అదాలత్‌ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. లోక్‌ అదాలత్‌లో క్రిమినల్‌, బ్యాంకు, చెక్కు, మోటారు యాక్సిడెంట్‌ నష్టపరిహారం, కుటుంబ తగాదాలు, సివిల్‌ కేసులు, ప్రీ లిటిగేషన్‌ కేసులను రాజీ కుదుర్చుకునే అవకాశం ఉంటుందన్నారు.  మొత్తం లోక్‌ అదాలత్‌లో మొత్తం 38 కేసులను పరిష్కరించారు.   కార్యక్రమంలో సీనియర్‌ సివిల్‌ జడ్జి డానియల్‌ రూత్‌, ప్రిన్సిపాల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కవిత,  ఎస్పీ నారాయణ, డీఎఫ్‌వో వేణుమాదవ్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ నారాయణగౌడ్‌, అశోక్‌కుమార్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు  నారాయణ, ప్రధాన కార్యదర్శి మహ్మద్ఫ్రీ, జాయింట్‌ సెక్రటరీ ప్రశాంత్‌రెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు.


logo