గురువారం 13 ఆగస్టు 2020
Vikarabad - Feb 08, 2020 , 23:57:45

రేపు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ

 రేపు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : ఈ నెల 10న జిల్లాలోని చిన్నారులందరికి  నులి నివారణ మాత్రలు వేయిస్తామని డీఎంహెచ్‌వో దశరథ్‌ అన్నారు. శనివారం పట్టణంలో వైద్యాధికారుల సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 3,00,633 మందిని నులి నివారణ మాత్రలు వేసేందుకు గుర్తించామని తెలిపారు. 1 నుంచి 19ఏండ్ల పిల్లలకు ఈ మాత్రలు వేస్తామని,  ఈ నెల 10న ఏదైనా కారణం వల్ల వేసుకోని పిల్లలకు తిరిగి 17న వేస్తామని స్పష్టంచేశారు. 1 నుంచి 5 ఏండ్ల పిల్లలను అంగన్‌వాడీలలో, 5 నుంచి 15 పాఠశాలలో, 15 నుంచి 19 ఏండ్ల వయస్సున్న వారిని కళాశాలలో గుర్తించి వారికి ఈ మాత్రలను వేయించడం జరుగుతుందన్నారు.  ఈ నెల 10న స్థానిక సంఘం లక్ష్మీబాయి గురుకుల పాఠశాలలో  కలెక్టర్‌, ఎమ్మెల్యే  జాతీయ నులి నిర్మూలన దినోత్సవ కార్యక్రమన్ని ప్రారంభిస్తారన్నారు.    


logo