గురువారం 06 ఆగస్టు 2020
Vikarabad - Feb 08, 2020 , T00:10

రెండోరోజు 304 నామినేషన్లు

రెండోరోజు 304 నామినేషన్లు

సహకార ఎన్నికలకు సంబంధించి రెండో రోజు నామినేషన్ల జోరు కొనసాగింది. రెండో రోజు శుక్రవారం ఒక్కరోజే 304నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యధికంగా ధారూర్‌ సొసైటీకి 35 నామినేషన్లు దాఖలు కాగా అత్యల్పంగా తట్టేపల్లి పీఏసీఎస్‌కు 3నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లాలోని 22 సొసైటీలకు తొలిరోజు 65నామినేషన్లు దాఖలుకాగా రెండో రోజు అధిక మొత్తంలో నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల దాఖలుకు నేడు ఆఖరు తేది కావడంతో ఆయా పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేయనున్నారు. దీంతో నేడు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలున్నాయి. జిల్లాలో రెండో రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. 22 సొసైటీలకుగాను 304 నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం ఆయా సొసైటీల్లో దాఖలైన నామినేషన్లకు సంబంధించి శివారెడ్డిపేట్‌లో 13, కొత్తగడిలో 13, ధారూర్‌లో 35, హరిదాస్‌పల్లిలో 4, పూడూర్‌లో 26, ఎక్‌మామిడిలో 5, వట్టిమీనపల్లిలో 10, మోమిన్‌పేట్‌లో 8, మేకవనంపల్లిలో 18, పెద్ద మర్పల్లిలో 16, బంట్వారంలో 13, పరిగిలో 13, మోత్కూర్‌లో 13, కుల్కచర్లలో 12, మెట్లకుంటలో 15, ఎల్మకన్నెలో 16, యాలాలలో 25, తట్టేపల్లిలో 3, నవాంగిలో 14, పెద్దేముల్‌లో 11, హస్నాబాద్‌లో 8, దౌల్తాబాద్‌లో 13 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే తొలిరోజు 65 నామినేషన్లు దాఖలయ్యాయి.


logo