శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Vikarabad - Feb 07, 2020 , 00:36:17

వడివడిగా రైతుబంధు

వడివడిగా రైతుబంధు

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : రాష్ట్ర ప్రభు త్వం అర్హులైన ప్రతి రైతుకు రైతుబంధు పెట్టుబడి సాయాన్ని అందజేస్తుంది. గతేడాది యాసంగి వరకు ఎకరాకు రూ. 8వేల పెట్టుబడి సహాయాన్ని అందజేసిన ప్రభుత్వం ప్రస్తుతం ఎకరాకు రూ. 10వేలు అందజేస్తుంది. 2019-20 సంవత్సరానికి ఇప్పటికే వానకాలం సీజన్‌కు సంబంధించిన పెట్టుబడి సాయా న్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయగా, ప్రస్తుతం యాసంగి సీజన్‌కు సంబంధించిన సాయాన్ని సంబంధిత అధికారులు రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేస్తున్నారు. ప్రస్తుతం 5ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు మాత్రమే పెట్టుబడి సహాయం అందిస్తున్నారు. పథకానికి సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలన ప్రక్రియ పూర్తి చేసి ఎప్పటికప్పుడు ఖజ నా శాఖకు అందిస్తున్నప్పటికీ, ఖజనా కార్యాలయంలో బిల్లులు ఆలస్యంగా చేయడంతో పాటు సంబంధిత బిల్లులకు పెట్టుబడి శాఖ ఆమోదం పొందాల్సి ఉన్నందునా పెట్టుబడి సహాయం కొంత ఆలస్యమవుతున్నట్లు సంబధిత అధికారులు చెబుతున్నారు. జిల్లాకు గతేడాది వానకాలంలో 1,97, 959మంది రైతులకు రూ. 220కోట్ల పెట్టుబడి సహాయం, యాసంగి సీజన్‌లో 1,76, 188మంది రైతులకు రూ. 206కోట్ల పెట్టుబడి సహాయాన్ని రైతులకు ప్రభుత్వం అందజేయగా, ఈ ఏడాది వానకాలంలో 1, 62,130 మంది రైతులకు రూ. 211కోట్లు, రబీ సీజన్‌కు ఇప్ప టి వరకు 1.50లక్షల మందికి రూ. 140కోట్లు రైతులకు రైతుబంధు పెట్టుబడి సహాయాన్ని ప్రభుత్వం అందజేసింది.  

ఇప్పటి వరకు రూ. 140కోట్ల రైతుబంధు జమ...

రైతులు అప్పుల బారిన పడకుండా రైతుబంధు సాయాన్ని టీఆర్‌ఎస్ ప్రభుత్వం అందిస్తుంది. గతేడాది ఎకరాకు రూ. 4 వేల పెట్టుబడి సహాయాన్ని అందించిన ప్రభుత్వం, సాగుకు కావాల్సిన విత్తనాలు, ఎరువుల ధరలు పెరుగడంతో దానికి తగినట్లుగా ప్రభుత్వం పెట్టుబడి సహాయాన్ని ఎకరాకు రూ. 5వేలకు పెంచుతామని ఎన్నికల సమయంలో రైతులకిచ్చిన మాట మేరకు వానకాలం నుంచి ఎకరాకు రూ. 5వేల పెట్టుబడి సహాయాన్ని రైతులకు అందిస్తుంది. యాసంగిలో జిల్లా వ్యాప్తంగా 2,07,652 మంది రైతులు ఉండగా రూ. 293కోట్ల నిధులను ప్రభుత్వం జిల్లాకు విడుదల చేసింది. వానకాలంలో 1,62, 130మంది రైతులకు రూ. 211కోట్ల సాయాన్ని రైతులకు అందజేశారు. అదే విధంగా ఈ ఏడాది యాసంగి సీజన్‌కు 1,69, 839మంది రైతులకు రూ. 240కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేయగా ఇప్పటి వరకు 1.50లక్షల మంది రైతులకు రూ. 140కోట్ల పెట్టుబడి సహాయం రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ అయింది. ఈ ఏడాది వానకాలంలో ఆయా మండలాల్లో ని రైతులకు అందిన పెట్టుబడి సహాయానికి సంబంధించి, బొంరాసుపేట్ మండలంలో 11,487మంది రైతులకు రూ.16.03 కోట్లు, దౌల్తాబాద్ మండలంలో 12,453మంది రైతులకు రూ. 16.92కోట్లు, కొడంగల్ మండలంలో 11,542మంది రైతులకు రూ. 17.41కోట్లు, దోమ మండలంలో 7761మంది రైతులకు రూ. 9.26కోట్లు, కుల్కచర్ల మండలంలో 8423మంది రైతులకు రూ.11.34కోట్లు, పరిగి మండలంలో 10,949 మంది రైతులకు రూ.13.93 కోట్లు, పూడూర్ మండలంలో 9450మంది రైతులకు రూ. 11.23కోట్లు, బషీరాబాద్ మండలంలో 8631మంది రైతులకు రూ. 14.19కోట్లు, పెద్దేముల్ మండలంలో 8891మంది రైతులకు రూ. 13.11 కోట్లు, తాండూర్ మండలంలో 7375మంది రైతులకు రూ. 9.95 కోట్లు, యాలాల్ మండలంలో 7215మంది రైతులకు రూ. 9.04కోట్లు, బంట్వారం మండలంలో 4381 మంది రైతులకు రూ. 6.22 కోట్లు, ధారూర్ మండలంలో 8374మంది రైతులకుగాను రూ. 9.40కోట్లు, కోట్‌పల్లి మండలంలో 6160 మంది రైతులకు రూ.8.04 కోట్లు, మర్పల్లి మండలంలో 9837 మంది రైతులకు రూ.11.94 కోట్లు, మోమిన్‌పేట్ మండలంలో 8150 మంది రైతులకు రూ.9.76 కోట్లు, నవాబుపేట్ మండలంలో 11,618 మంది రైతులకు రూ.13.87 కోట్లు, వికారాబాద్ మండలంలో 9433 మంది రైతులకు రూ.10.22 కోట్ల పెట్టుబడి పెట్టుబడి సహాయాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.

గతేడాది రూ. 426కోట్ల నిధులు 

రైతులకు పెట్టుబడి సాయమందించేందుకు ప్రభుత్వం అమ లు చేస్తున్న రైతుబంధు కార్యక్రమంలో భాగంగా గతేడాది వానకాలం సీజన్‌లో పెట్టుబడి సహాయాన్ని చెక్కుల రూపంలో అందజేయగా.. యాసంగి సీజన్‌లో నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే డబ్బులను ఎకరానికి రూ. 4వేల చొప్పున జమ చేశారు.  జిల్లాలో రైతుబంధు కార్యక్రమంలో భాగంగా గతేడాది వానకాలం, యాసంగి సీజన్‌లో జిల్లాలోని రైతులకు రూ. 426 కోట్ల పెట్టుబడి సహాయాన్ని ప్రభుత్వం రైతులకు అందజేసింది. గతేడాది వానకాలం సీజన్‌కు 2.25లక్షల మంది రైతులకు రూ. 244కోట్లను ప్రభుత్వం జిల్లాకు విడుదల చేయగా.. జిల్లాలో వివాదాస్పద భూములు ఉన్న దృష్ట్యా 1,97,959మంది రైతులకుగాను రూ. 220కోట్ల పెట్టుబడి సాయమందించారు. అదే విధంగా రబీ సీజన్‌కు సంబంధించి 1,99,594మంది రైతులుండగా వివాదస్పద భూముల దృష్ట్యా 1,76,188మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 206కోట్లను ప్రభుత్వం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది.


logo