శుక్రవారం 14 ఆగస్టు 2020
Vikarabad - Feb 07, 2020 , 00:29:20

మహనీయుల విగ్రహావిష్కరణ

మహనీయుల విగ్రహావిష్కరణ

కులకచర్ల : కులకచర్ల మం డల పరిధిలోని ఘణాపూర్‌లో బుధవారం రాత్రి మహనీయుల విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించా రు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి పరిగి ఎమ్మెల్యే కొప్పు ల మహేశ్‌రెడ్డి హాజరై మాట్లాడు తూ మహనీయుల విగ్రహాలు గ్రామాల్లో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నా రు. మహనీయులను యువత ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. ఘణాపూర్‌లో వివిధ అభివృద్ధి పనుల గురించి గ్రామస్తులు తెలియజేయగా ఆయన స్పందిస్తూ అభివృద్ధికి నిధులు మంజూరు చేసే విధంగా చూస్తామన్నా రు. దేవాలయ నిర్మాణం కోసం దేవాదాయ శాఖ ద్వారా నిధులు మంజూరు అయ్యే విధంగా చూస్తానని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని ఎన్నికలు పూర్తయ్యాయని ప్రస్తు తం అభివృద్ధిపై దృష్టి సారించిందని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. కళాకారులతో ఆటపాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి, ఎంపీటీసీ వెంకటమ్మ, జిల్లా టీఆర్‌ఎస్ నాయకుడు బుయ్యని మనోహర్‌రెడ్డి, ఎంపీపీ సత్యమ్మహరిశ్చంద్ర, జడ్పీటీసీ రాందాస్‌నాయక్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు శంకర్‌నాయక్, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పీరంపల్లి రాజు, మార్కెట్ కమిటీ అధ్యక్షుడు నర్సింహులు, స్వేరోస్ జిల్లా అధ్యక్షుడు అశోక్‌కుమార్, గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌నాయక్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కరణం ప్రహ్లాద్‌రావు, మాజీ ఏఎంసీ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు సారా శ్రీనివాస్, మాజీ అధ్యక్షుడు హరికృష్ణ, రాజప్ప, నాగరాజు, ఎంపీటీసీ రాంలాల్, పీఏసీఎస్ అధ్యక్షుడు భీంరెడ్డి, రాఘవేందర్‌గౌడ్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ యువజన సం ఘాల నాయకులు, పార్టీల నాయకులు, గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. 

పరిగి, నమస్తే తెలంగాణ : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ మొదటి రోజు గురువారం పరిగి పీఏసీఎస్‌లో 6నామినేషన్లు దాఖలయ్యాయి. పీఏసీఎస్ పరిధిలోని ఒకటో వార్డు నుంచి 2, 2వ వార్డు నుంచి ఒకటి, 12వ వార్డు నుంచి 2, 13వ వార్డు నుంచి ఒక నామినేషన్ దాఖలైంది. అభ్యర్థులు తమ నామినేషన్లను రిటర్నింగ్ అధికారి వీరాస్వామికి అందజేశారు. టీఆర్‌ఎస్ తరపున పీఏసీఎస్ చైర్మన్ అభ్యర్థిగా నిర్ణయించిన కొప్పుల శ్యాంసుందర్‌రెడ్డి ఒకటో వార్డు నుంచి తమ నామినేషన్ దాఖలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కె.అరవిందరావు, వైస్ ఎంపీపీ కె.సత్యనారాయణ, టీఆర్‌ఎస్ మండల నాయకులు బి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, దోమ రాంచంద్రయ్య, ఎ.సురేందర్‌కుమార్, కొప్పుల వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. 

కులకచర్లలో..

కులకచర్ల : కులకచర్ల మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయంలో గురువారం మొదటి రోజు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. మొదటి రోజు ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కులకచర్ల మండలం టీఆర్‌ఎస్ పీఏసీఎస్ చైర్మన్ అభ్యర్ధి బుయ్యని మనోహర్‌రెడ్డి టీఆర్‌ఎస్ నాయకుల ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో పీఏసీఎస్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. 3వ టీసీ నుంచి లింగంపల్లి నుంచి వెంకటయ్య, 4వ టీసీ తిర్మలాపూ ర్ నుంచి బుయ్యని మనోహర్‌రెడ్డి, 12వ టీసీ సాల్వీడ్ నుంచి కొండయ్య, 6వ టీసీ మందిపాల్ నుంచి నాగరాజు, 13వ టీసీ బండవెల్కిచర్ల నుంచి సత్యమ్మ, సుగుణమ్మలు తమ నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో నాలుగు టీఆర్‌ఎస్ పార్టీ నుంచి నామినేషన్లు వేయగా రెండు కాంగ్రెస్ నుంచి దాఖలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సత్యమ్మహరిశ్చంద్ర, జడ్పీటీసీ రాందాస్, రైతు సంఘం మండల అధ్యక్షుడు పీరంపల్లి రాజు, ఏఎంసీ అధ్యక్షుడు నర్సింహు లు, వైస్ ఎంపీపీ రాజశేఖర్‌గౌడ్, నాయకులు సుధాకర్‌రెడ్డి, నాగరాజు, రాజప్ప, శంకర్‌నాయక్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు సారా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి గుండుమల్ల నర్సింహులు, టీఆర్‌ఎస్ నాయకులు, సర్పంచులు పాల్గొన్నారు. 

దోమ మండలంలో.. 

దోమ : దోమ మండల కేంద్రంలోని పీఎసీఎస్ మోత్కూ ర్ సంఘానికి గురువారం ఐదుగురు నామినేషన్లు వేశారని సీఈవో యాదగిరి, ఎన్నికల అధికారి గంగాధర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్‌ఎస్ నుంచి చైర్మన్ అభ్యర్థిగా గుండాల గ్రామానికి చెందిన ప్రభాకర్ రెడ్డి నామినేషన్ వేశారు. సకాలంలో కార్యలయానికి వచ్చి నామినేషన్ల ప్రక్రియాను పూర్తి చేయాలని ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులకు తెలియజేశారు. కార్యక్రమంలో సర్పంచుల సంఘం అధ్యక్షుడు రాజిరెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు హన్మంతు నాయక్, సీనియర్ నాయకులు రాఘవేందర్ రెడ్డి, కృష్ణరెడ్డి, జగత్‌రెడ్డి, ఎంపీటీసీ నవాజ్‌రెడ్డి, వెంకటయ్య ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.

మొదటి రోజు నాలుగు నామినేషన్లు

పూడూరు : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎన్నికలకు మొదటి రోజు నల్గురు అభ్యర్థులు వేర్వేరు వార్డు లో నామినేషన్లు వేశారు. గురువారం 1వ వార్డుకు పి. సుభాశ్‌రెడ్డి, పి.భరత్‌రెడ్డిలు, 2వ వార్డుకు పి.సతీశ్‌రెడ్డి నామినేషన్ వేయగా, 8వ వార్డుకు గడ్డం నర్సమ్మ నామినేషన్ పత్రాలను అందజేసినట్లు ఆయన తెలిపారు. సోసైటీ చైర్మన్ బరీలో ఉన్న పి.సతీశ్‌రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ సొసైటీలోని రైతులు సరైన అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. వీరితో పాటు ఎస్. సురేందర్, గోవర్ధన్‌రెడ్డి, ఆర్‌కృష్ణ, శ్రీధర్, బుచ్చిరెడ్డి, ముక్కంటి, ఎన్నికల అధికారులు ఉన్నారు.


logo