మంగళవారం 04 ఆగస్టు 2020
Vikarabad - Feb 07, 2020 , 00:22:54

రైతులకు అవసరమయ్యే మొక్కలను పెంచాలి

 రైతులకు అవసరమయ్యే మొక్కలను పెంచాలి

కోట్‌పల్లి : రైతులకు అవసరమైయ్యే మొక్కలను నర్సరీల్లో పెంచాలని డీఆర్‌డీఏ పీడీ కృష్ణన్ అన్నారు. గురువారం  తహసీల్దార్ కార్యాలయంలో ఏపీవో, ఫిల్డ్ అసిస్టెంట్లలతో డీఆర్‌డీఏ పీడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలపై ఏపీవో, ఫీల్డ్‌అసిస్టెంట్లు దృష్టి పెట్టాలని సూచించారు. నర్సరీల్లో మట్టిని సేకరించి, విత్తనాలను పోగు చేసుకోవాలన్నారు. స్థానిక నర్సరీల్లో రైతులు, ప్రజలకు కావాల్సిన మొక్కలు ఏంటో తెలుసుకుని వాటిని పెంచాలని స్పష్టం చేశారు. వైకుంఠధామాలు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు


logo