గురువారం 06 ఆగస్టు 2020
Vikarabad - Feb 05, 2020 , 23:59:35

ప్రజలకు అందుబాటులో ఉండాలి

ప్రజలకు అందుబాటులో ఉండాలి
  • తడి, పొడి చెత్త సేకరణపై మహిళలకు పంచాయతీ కార్యదర్శులు అవగాహన కల్పించాలి
  • గ్రామాల్లో తాగునీటి కొరత లేకుండా చూడాలి
  • కలెక్టర్‌ పౌసుమి బసు
  • పూడూరు మండలంలో పల్లె ప్రగతి పనుల పరిశీలన

పూడూరు : గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఉద యం 7గంటలలోపే గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్‌ పౌసుమి బసు అన్నారు. బుధవారం పూడూరు మండలం అంగడిచిట్టంపల్లి, పూడూ రు, చీలాపూర్‌ గ్రామాలను ఉదయం సందర్శం చి ఆయా పనులను పరిశీలించారు. నర్సరీ, డంపింగ్‌యార్డు, శ్మశానవాటిక, పరిసరాల పరిశుభ్రత వంటి కార్యక్ర మలు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. పూడూరు దామగుండ రామలింగేశ్వరస్వామి దేవాలయ ప్రాంతంలో నేవీ సిగ్నల్‌ కేంద్రం ఏర్పాటు చేయొద్దని సర్పంచ్‌ నవ్యరెడ్డి గ్రామస్తులు కలిసి కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆమె స్పందిస్తు సంబంధిత శాఖ అధికారులతో చర్చిస్తామని తెలిపారు. చీలాపూర్‌ గ్రామ పంచాయతీ భవనం పనులు పూర్తి చేయడం లేదని సర్పంచ్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. భవన నిర్మాణం పనులు త్వరగా చేపట్టాలని ఎంపీటీసీకి సూచించారు. అంగడిచిట్టంపల్లి గ్రామ పంచాయతీ లో నెల రోజుల క్రితం మీషన్‌ భగీరథ పైపులైన్‌ పగిలిందని ఆర్‌డబ్ల్యూస్‌ ఏఈ నర్సింహులుకు తెలిపిన పట్టించుకోవడం లేదని సర్పంచ్‌ జయమ్మ, ఎంపీటీసీ నాగమణిలు తెలిపారు. 


దీంతో కలెక్టర్‌ ఏఈని అడుగగా సరైన సమాధానం ఇవ్వకపోవడంతో కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ 5రోజుల్లో తాగునీరు అందేలా చూడలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి తప్పనిసరిగా ట్రాక్టర్‌ను కొనుగోలు చేయాలన్నారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి రిజ్వానా, ఎంపీడీవో ఉష, తహసీల్దార్‌ దీప క్‌, సొసైటీ చైర్మన్‌ నర్సింహరెడ్డి, సర్పంచ్‌ రాములు, ఎంపీటీసీ రామకృష్ణారెడ్డి,లక్ష్మి, తాజొద్దీన్‌, బీజేపీ మల్లేశం, విఠలయ్య తదితరులు ఉన్నారు.


logo