సోమవారం 03 ఆగస్టు 2020
Vikarabad - Feb 05, 2020 , 00:17:09

గ్రామాల్లో బెల్ట్‌షాపుల జోరు..!

గ్రామాల్లో బెల్ట్‌షాపుల జోరు..!

దౌల్తాబాద్‌ : మద్యం మత్తులో ఎమ్మార్పీ కంటె అధిక ధరలకు మధ్యాన్ని విక్రయిస్తూ మందు బాబుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. ఒక్కో మద్యం బాటిల్‌ను రూ. 10 నుంచి 15వరకు అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను, ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ, ఎక్సైజ్‌ అధికారులు మామూళ్ల మత్తులో వ్యాపారుల వంత పడుతున్నారు. ఎమ్మార్పీ  కంటే అధిక ధరలకు, కల్తీ మద్యన్ని విక్రయిస్తూన్నారని అధికారులకు తెలిసిన చూసిచుడనట్లు వ్యవహరిస్తు కాలం వెళ్లదిస్తున్నారు. 

బార్లుగా దాబాలు.. 

మండంలోని చెల్లాపూర్‌, గోకఫస్లవాద్‌, దేవర్‌ఫస్లవాద్‌, బాలంపేట, అంతరం, గుం డేపల్లి, కుదురుమళ్ల, నందారం, యంకి, గుముడాల, బిచ్చల్‌, చంద్రకల్‌, నాగసార్‌, తిర్మాలపూర్‌ గ్రామాల్లో బెల్టు షాపులు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. తాగు నీరు దొరకని ఊరు ఉన్నా మద్యం దొరకని పల్లె లు లేవంటే అతిశయోక్తి కాదు. దీనికి తోడు పట్టణంలో హోటళ్ల పేరిట దాబాలు ఓపన్‌ బార్లుగా కొనసాగుతున్నాయి. మండల కేంద్రంలో ఉండే షాపుల నుంచే మద్యాన్ని కొనుగోలు చేసి మరింత అధిక ధరలకు విక్రయిస్తూ మద్యం బాబుల అవసరన్ని ఆసరాగా చేసుకుంటున్నారు. దీంతో సామాన్యుడు అలసట తీర్చుకునేందుకు తీసుకునే మద్యం తాగకుండానే కిక్కునిస్తుంది. మద్యం వ్యాపారుల అక్రమాలు అరికట్టాలని మందుబాబులు కోరుతున్నారు.


logo