మంగళవారం 11 ఆగస్టు 2020
Vikarabad - Feb 05, 2020 , 00:16:16

ఎల్‌ఐసీని ప్రైవేటీకరణ చేయొద్దు

ఎల్‌ఐసీని ప్రైవేటీకరణ చేయొద్దు

వికారాబాద్‌ టౌన్‌ : బీజేపీ ప్రభుత్వం దేశాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు కుట్రలు చేస్తుందని ఇ న్యూరెన్స్‌ కార్పొరేషన్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధ్యక్షుడు జంగయ్య అన్నారు. మంగళవారం పట్టణంలోని ఎల్‌ఐసీ కార్యాలయం వద్ద ఎల్‌ఐసీ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే అతి పెద్ద సంస్థ అయినా ఎల్‌ఐసీని ప్రైవేటీకరణ చేయొద్దని అన్నా రు. దేశంలో బీజేపీ ప్రభుత్వం పరిపాలన సాగిస్తున్నప్పటి నుంచి అన్ని సంస్థలను ప్రైవేటీకరణ చేసుకుంటూ వస్తుందన్నారు. దీని ద్వారా నిరుద్యోగం పెరుగుతుందన్నారు. 

మూడు రోజుల క్రిందట ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో ఎల్‌ఐసీ ఫండ్స్‌ని షేర్‌ మార్కెట్‌లో పెట్ట డం కోసం ప్రయాత్నలు సాగించడం జరుగుతుందన్నారు. దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నష్టాల్లో ఉన్న సంస్థలను మాత్రమే ప్రైవేటీకరణ చేసిందని, మొదటి సారిగా లాభాలో ఉన్న  ఎల్‌ఐసీని కూడా ప్రైవేటీకరణ చేయాడం కోసం చర్యలు చేపట్టడం విడ్డురంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రతి ఏటా పన్నుల చెల్లింపు రూపంలో ఎల్‌ఐసీ కంపెనీ కొన్ని రూ.కోట్లను చెల్లిచడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మ ల్లేశం, కేవీపిఎస్‌ జిల్లా కార్యదర్శి మహిపాల్‌, ఎల్‌ఐసీ ఉద్యోగులు పాల్గొన్నారు.


logo