ఆదివారం 09 ఆగస్టు 2020
Vikarabad - Feb 05, 2020 , 00:16:16

ప్రతి రికార్డులను సక్రమంగా నిర్వహించాలి

ప్రతి రికార్డులను సక్రమంగా నిర్వహించాలి

బంట్వారం : అంగన్‌వాడీ కేంద్రాల్లో అన్ని రికార్డులను సక్రమంగా నిర్వహించాలని ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ సునీత అన్నా రు. మంగళవారం మండల పరిధిలోని సు ల్తాన్‌పూర్‌ గ్రామంలోని అంగన్‌వాడీ కేం ద్రాన్ని సందర్శించి, పలు రికార్డులను క్షు ణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనన, మరణ రికార్డు లు, పిల్లల ఆరోగ్య రికార్డులన్నీ ఎప్పటికప్పుడు నమోదు చేయాలని పేర్కొన్నారు. ఎలాంటి పొరపాట్లు చేయకుండా సక్రమంగా నిర్వహించాలన్నారు. అయితే పెంటయ్య మరణ రికార్డుపై పలు అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఆమె సంబంధిత రికార్డును పరిశీలింగా, 2018 జూలై 29న మరణించినట్లు సర్వే రికార్డు లో నమోదై ఉందన్నారు. చిన్న పిల్లల రికార్డులను, వలసలు వెళ్ళిన, వచ్చిన కుటుంబాల వివరాలను సక్రమంగా నమోదు చేయాలన్నారు. బా ల్య వివాహాలపై నిఘా ఉంచాలన్నారు. సర్పంచ్‌ సూచన మేరకు సమావేశం నిర్వహించి సమస్యలపై చర్చించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ నర్సింహులు, అంగన్‌వాడీ టీచర్‌ రాములమ్మ, సిబ్బంది పాల్గొన్నారు.


logo