శుక్రవారం 14 ఆగస్టు 2020
Vikarabad - Feb 05, 2020 , 00:13:34

నిరుద్యోగ యువతులకు ఉచిత కంప్యూటర్‌ శిక్షణ

నిరుద్యోగ యువతులకు ఉచిత కంప్యూటర్‌ శిక్షణ

బొంరాస్‌పేట : జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, ఎంప్లాయిమెంట్‌ జనరేషన్‌, మార్కెటింగ్‌ మిషన్‌ వారి ఆధ్వర్యంలో మండలంలోని నిరుద్యోగ యువతులకు కంప్యూటర్‌లో ఉచితంగా శిక్షణ ఇస్తారని ఐకేపీ ఏపీఎం అంజిలయ్య ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులకు మూడు నెలల పాటు ఉచిత భోజనం, వసతి సౌకర్యం కల్పించి శిక్షణ ఇస్తారని శిక్షణ తరువాత హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఉపాధి కల్పిస్తారని, అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా నెలకు రూ. 10వేల నుంచి రూ. 12,500లు వేతనం ఇస్తారని ఆయన తెలిపారు. శిక్షణ సమయంలో రెండు జతల యూనిఫాం ఉచితంగా అందిస్తారని తెలిపారు. అభ్యర్థులు 10వ తరగతి పాసై ఉండాలని, ఆసక్తి గలవారు 10వ తరగతి పాస్‌ సర్టిఫికేట్లు, రేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డు, పాన్‌కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకం జిరాక్సులు, రెండు పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోలు తీసుకుని జిల్లా కేంద్రంలోని డీఆర్‌డీఏ కార్యాలయంలో హాజరు కావాలని ఏపీఎం అంజిలయ్య కోరారు.


logo