మంగళవారం 11 ఆగస్టు 2020
Vikarabad - Feb 03, 2020 , 23:55:37

నోటిఫికేషన్‌ వచ్చేసింది..

నోటిఫికేషన్‌ వచ్చేసింది..
  • ఈనెల 6 నుంచి 8 వరకు నామినేషన్ల స్వీకరణ
  • 9న పరిశీలన, 10న ఉపసంహరణకు గడువు
  • 15న పోలింగ్‌, అదేరోజు ఓట్ల లెక్కింపు, ఫలితాలు
  • జిల్లాలో 22 సంఘాల్లోని 286 డైరెక్టర్లకు ఎన్నికలు
  • ఒక్కో సహకార సంఘంలో 13 మంది డైరెక్టర్లు
  • జిల్లాలో మొత్తం 87,635 మంది సభ్యులుండగా, 63,794 మంది అర్హులుగా గుర్తింపు

వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలకు నోటిఫికేషన్‌ వచ్చేసింది. ఇప్పటికే సహకార ఎన్నికల షెడ్యూల్‌ను విడుదలకాగా, సోమవారం అధికారులు ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. అయితే ఈనెల 6 నుంచి 8 వరకు మూడు రోజులపాటు నామినేషన్లను స్వీకరించనున్నారు. తదనంతరం 9న నామినేషన్లను పరిశీలన ప్రక్రియను పూర్తి చేయనున్నారు. అదేవిధంగా నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 10వ తేదీతో గడువు ముగియనుంది. అయితే జిల్లాలోని 22 సహకార సంఘాల్లోని 286 డైరెక్టర్లకు 15న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ జరుగనుంది. అదేరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టి అనంతరం ఫలితాలను ప్రకటించనున్నారు. అయితే సహకార ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియను కూడా పూర్తి చేశారు.


అయితే 13 మంది డైరెక్టర్ల స్థానాలకుగాను రిజర్వేషన్లలో ప్రతి సోసైటీలో ఏడు ఓసీలకు, 2 బీసీలకు, 2 ఎస్సీలకు, ఒకటి ఎస్టీకి, ఒకటి ఓసీ మహిళకు రిజర్వేషన్‌ కల్పించారు. అయితే జిల్లాలో 286 సహకార సంఘాలుండగా ఓసీ(జనరల్‌)-154, ఓసీ(మహిళ)-22, బీసీ(జనరల్‌)-44, ఎస్సీ(జనరల్‌)-22, ఎస్సీ(మహిళ)-22, ఎస్టీ(జనరల్‌)-44 స్థానాల్లో రిజర్వేషన్‌ కల్పిస్తూ నిర్ణయించారు. అయితే వీరిలో ఎవరైనా చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌గా ఎన్నికకావొచ్చు. మరోవైపు జిల్లాలోని 22 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో 87,635 మంది సభ్యులుండగా, 63,794 మంది అర్హులైన ఓటర్లున్నట్లు జిల్లా సహకార శాఖ అధికారులు ఓటర్ల తుది జాబితాను విడుదల చేశారు. 


63,794 మంది ఓటర్లు...

జిల్లాలోని 22 సహకార సంఘాల్లో 87,635 మంది సభ్యులుండగా 63,794 మంది అర్హులైన ఓటర్లు ఉన్నట్లు జిల్లా సహకార శాఖ అధికారులు ఓటరు తుది జాబితాను విడుదల చేశారు. దీర్ఘకాలిక రుణాలను పొంది నిర్ణీత గడువులోగా చెల్లించని వారిని డిపాల్టర్లుగా నిర్ణయించి ఓటేసేందుకు అనర్హులుగా గుర్తించారు. అయితే శివారెడ్డిపేట్‌ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో 5320 మంది సభ్యులుండగా 3755 మంది అర్హులైన ఓటర్లు, ధారూర్‌ పీఏసీఎస్‌లో 6151 మంది సభ్యులుండగా 4388 మంది, హరిదాసుపల్లిలో 518 మంది సభ్యులుండగా 365 మంది, వట్టిమీనపల్లిలో 4252 మంది సభ్యులుండగా 3654 మంది, పూడూర్‌లో 5450 మంది సభ్యులుండగా 4540 మంది, మోమిన్‌పేట్‌లో 3862 మంది సభ్యులుండగా 3358 మంది, మర్పల్లిలో 6150 మంది సభ్యులుండగా 4691 మంది, మేకవనంపల్లిలో 1724 మంది సభ్యులుండగా 1346 మంది, బంట్వారంలో 3973 మంది సభ్యులుండగా 3466 మంది, ఎల్లంకన్నలో 2981 మంది సభ్యులుండగా 2145, యాలాలలో 4567 మంది సభ్యులుండగా 3029, నవాంగిలో 4780 మంది సభ్యులుండగా 3468 మంది, తట్టేపల్లిలో 2250 మంది సభ్యులుండగా 1922 మంది, హస్నాబాద్‌లో 2900 మంది సభ్యులుండగా 2878 మంది, దౌల్తాబాద్‌లో 6229 మంది సభ్యులుండగా 3125 మంది, పరిగిలో 3516 మంది సభ్యులుండగా 3244 మంది, కుల్కచర్లలో 5270 మంది సభ్యులుండగా 3919 మంది, మోత్కూరులో 5574 మంది సభ్యులుండగా 4264 మంది, మెట్లకుంటలో 3400 మంది సభ్యులుండగా 2621 మంది, కొత్తగడిలో 1280 మంది సభ్యులుండగా 820 మంది, ఎక్‌మామిడిలో 995 మంది సభ్యులుండగా 816  మంది, ఎఫ్‌ఎస్‌సీఎస్‌ పెద్దేముల్‌లో 6493 మంది సభ్యులుండగా 1922 మంది అర్హులైన ఓటర్లున్నారు. అయితే సహకార ఎన్నికల్లో పార్టీల వారీగా ఎన్నికలు కాకుండా అభ్యర్థుల వారీగా ఎన్నికలు జరుగతాయి కాబట్టి బ్యాలెట్‌ పత్రాల్లో ఆయా పార్టీల గుర్తులు కాకుండా స్వతంత్ర గుర్తులు ఉండనున్నాయి.


22 పీఏసీఎస్‌లకు జరుగనున్న ఎన్నికలు..

జిల్లాలోని 22 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికలను నిర్వహించేందుకుగాను జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. అయితే 2018 డిసెంబర్‌ 31 వరకుగల అర్హులైన సభ్యులను పరిగణనలోకి తీసుకొని అర్హులైన ఓటర్లను గుర్తించారు. అయితే దీర్ఘకాలిక రుణాలను నిర్ణీత గడువులోగా చెల్లించని సభ్యులను అనర్హులుగా గుర్తించారు. అయితే జిల్లాలోని 22 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో 87,635 మంది సభ్యులుండగా 63,794 మంది అర్హులైన ఓటర్లతో తుది జాబితాను విడుదల చేశారు. జిల్లాలోని పీఏసీఎస్‌లకు సంబంధించి వికారాబాద్‌ శివారెడ్డిపేట, ధారూరు, హరిదాస్‌పల్లి, వట్టి మీనపల్లి సొసైటీ, పూడూరు, మోమిన్‌పేట, పెద్ద మర్పల్లి, మేకవనంపల్లి, బంట్వారం, ఎల్మకన్న, యాలాల, నావన్‌డ్గి, తట్టెపల్లి, హుస్నాబాద్‌, దౌల్తాబాద్‌, పరిగి, కులకచర్ల, మోత్కుర్‌, మెట్ల కుంట, కొత్తగడి, ఎక్‌మామిడి, పెద్దేముల్‌ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లోని 286 డైరెక్టర్లకు ఎన్నికలు జరుగనున్నాయి.


logo