శుక్రవారం 05 జూన్ 2020
Vikarabad - Feb 03, 2020 , 23:49:56

అధికారుల భరోసా..పాఠశాలకు విద్యార్థిని

అధికారుల భరోసా..పాఠశాలకు విద్యార్థిని
  • తల్లి మరణం, తండ్రికి పక్షపాతం-పాఠశాల మానేసినిన వైనం

బషీరాబాద్‌: తల్లి మరణించడం, తండ్రికి పక్షవాతం రావడంతో పాఠశాలను వదిలేసిని ఓ విద్యార్థినికి అధికారులు ఆర్థిక సహాయం చేసి తిరిగి పాఠశాలకు పంపించారు. సోమవారం గ్రామానికి వెళ్లిన ఎంపీవో రమేశ్‌ విద్యార్థిని తండ్రి వెంకటయ్యతో మాట్లాడి పాఠశాలకు పంపించేలా చేశారు. మండల పరిధిలోని కాశీంపూర్‌ గ్రామానికి చెందిన జెట్టి కీర్తన మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్‌ పాఠశాలలో 10 తరగతి చదువుతుంది. మూడు నెలల క్రితం కీర్తన తల్లి మరణించింది. తండ్రికి పక్షవాతం రావడంతో పాఠశాల మానేసింది. దీంతో అధికారుల విషయం తెలుసుకుని గ్రామానికి వెళ్లి కీర్తన తండ్రితో మాట్లాడారు. పదోతరగతి వరకు చదివించిన కూతురిని పరీక్షలు రాయకుండా పాఠశాల మాన్పించడం సరికాదని చెప్పారు.


నెల రోజులైతే పరీక్షలు వస్తాయని, పరీక్షలు రాయనివ్వండని, పాఠశాలకు పంపించాలని విద్యార్థిని తండ్రి వెంకటయ్యకు ఎంపీఓ ఒప్పించారు. అంతేకాకుండా పరీక్షకాలం వరకు అయ్యే ఖర్చులు భరిస్తామని భరోసా కల్పించారు. దీంతో తండ్రి వెంకటయ్య కీర్తనను పాఠశాలకు పంపిస్తానని అధికారులతో పేర్కొన్నారు. అధికారుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మంచిగా చదువకుని, మంచి మార్కులు సాధిస్తానని విద్యార్థిని పేర్కొంది. మండల ప్రత్యేకాధికారి(ఏడీ మైన్స్‌) రవి, ఎంపీడీవో ఉమాదేవి విద్యార్థినికి ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. కొంత ఆర్థిక సహాయం చేసి కీర్తనను పాఠశాలకు పంపించారు.


logo