గురువారం 13 ఆగస్టు 2020
Vikarabad - Feb 02, 2020 , 23:26:40

గిరిజన తండాలకు తారు రోడ్లు వేస్తాం

 గిరిజన తండాలకు తారు రోడ్లు వేస్తాం
  • సేవాలాల్‌, మరియమ్మ ఉత్సవాలకు సర్కారు నిధులు
  • పంచాయతీలతోనే గిరిజనులకు రాజ్యాధికారం
  • మౌలిక సదుపాయాల కల్పనకు నిధులిస్తాం
  • ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి

బషీరాబాద్‌: తండాలకు తారు రోడ్లు నిర్మించి తండా ప్రజల ఇబ్బందులు తీరుస్తామని తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి అన్నారు. ఆదివారం బాబునాయక్‌, ఇస్మాయిల్‌పూర్‌తండాల్లో సేవాలాల్‌, మరియమ్మలకు నిర్వహించిన ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సేవలాల్‌, మరియమ్మ ఉత్సవాలకు సీఎం కేసీఆర్‌ నిధులు ఇస్తున్నారని పేర్కొన్నారు. తండాలను పంచాయతీలుగా చేసి గిరిజనులకు రాజ్యాధికారం ఇచ్చారని పేర్కొన్నారు. గిరిజన తండాలు పంచాయతీలుగా ఏర్పడిన తరువాత తండాల ముఖచిత్రాలు మారనున్నాయని తెలిపారు. మండలంలోని తండాలకు మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేస్తామన్నారు. బాబునాయక్‌తండాకు త్వరలోనే రోడ్డు నిర్మిస్తామని తండా ప్రజలకు హామీ ఇచ్చారు. తండాల అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందజేస్తానని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు డి. నర్సింహులు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు సాబేర్‌, సూర్య, దశరథ్‌, నాయకులు నర్సిరెడ్డి, నరేశ్‌ చవాన్‌, రామునాయక్‌, మునీందర్‌రెడ్డి, రంగారెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, ముకుంద్‌, సూర్యనాయక్‌, మోహన్‌రాథోడ్‌, తదితరులు పాల్గొన్నారు.


logo