శుక్రవారం 07 ఆగస్టు 2020
Vikarabad - Feb 01, 2020 , 23:48:55

సరిపడా ఎరువులు

సరిపడా ఎరువులు
  • యాసంగికి 5,300 మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరం
  • మార్క్‌ఫెడ్‌ దగ్గర 5,700 మెట్రిక్‌ టన్నుల యూరియా బఫర్‌ స్టాక్‌
  • జిల్లాలో 23,974 హెక్టార్లలో వివిధ రకాల పంటల సాగు

పరిగి, నమస్తే తెలంగాణ : జిల్లాలో యాసంగి సీజన్‌లో సాగుచేసిన పంటలకు సరిపడా ఎరువులు అధికారులు అందుబాటులో ఉంచారు. ఎరువులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూసేందుకు అధికారులు ముందస్తుగానే ప్రణాళికలు సిద్ధం చేసి అవసరం మేరకు ఎరువులు తెప్పించారు. తద్వారా యాసంగి  పంటల సాగుకు అవసరమైన మేరకు రైతులకు ఎప్పటికప్పుడు అందజేసేందుకు ఎరువులు సిద్ధంగా ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. గత పాలకుల హయాంలో ఎరువుల కోసం రైతాంగం నానా ఇబ్బందులు ఎదుర్కొన్న సంఘటనలు ఉండగా, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం ముందుగానే ఆ సీజన్‌లో ఎంతమేరకు విస్తీర్ణంలో ఏ పంటలు సాగు చేయబడతాయి, ఎరువులు ఎంత మోతాదులో అవసరమవుతాయనేది అంచనాలు తయారు చేసి, ముందస్తుగానే ఎరువులు ఆయా జిల్లాలకు పంపించి బఫర్‌ స్టాకులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. తద్వారా ఎరువుల కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. రైతాంగానికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అవసరమైన సమయంలో ఆయా పంటలకు సరిపడా ఎరువుల పంపిణీ జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా యాసంగిలో వివిధ పంటల సాధారణ సాగు 25,422 హెక్టార్లుండగా ఇప్పటివరకు 23,974 హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేయబడ్డాయి. వాటికిగాను సుమారు 10,395 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఆయా పంటల సాగుకు అవసరమైన అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉన్నాయని, ఎరువులకు ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు పేర్కొంటున్నారు. యాసంగి సాగులో అధికమొత్తంలో అవసరమయ్యే యూరియా ఎరువులు సరిపడ కంటే అధికంగా బఫర్‌ స్టాకు ఉన్నాయని అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా రైతులకు ఇబ్బంది కలుగకుండా ఎరువులు అందజేసేందుకు సిద్ధంగా ఉంచినట్లు వ్యవసాయాధికారులు వెల్లడించారు. 


25,422 ఎకరాల సాధారణ సాగు...

జిల్లాలో యాసంగి సీజన్‌లో వివిధ రకాల పంటలు 25,422 హెక్టార్లలో సాగు చేయడం జరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో ఇప్పటివరకు 23,974 హెక్టార్లలో ఆయా పంటలను సాగు చేయడం జరిగింది. యాసంగిలో అత్యధికంగా వరి 7,228 హెక్టార్లలో సాగు చేయాల్సి ఉండగా 5,386 హెక్టార్లలో సాగు చేయబడింది. వేరుశనగ పంట 5,547 హెక్టార్లకుగాను 5,212 హెక్టార్లు, శనగ పంట 2,993 హెక్టార్లకుగాను 2,936 హెక్టార్లు, జొన్న పంట 2,221 హెక్టార్లకు 1,165 హెక్టార్లలో, చెరుకు 1,634 హెక్టార్లకు 1,460 హెక్టార్లు, ఉల్లిగడ్డ 1,407 హెక్టార్లకు 1,366 హెక్టార్లు, మొక్కజొన్న 625 హెక్టార్లకు 613 హెక్టార్లలో సాగు చేయడం జరిగింది. తద్వారా జిల్లా వ్యాప్తంగా సాధారణ సాగులో 97శాతం విస్తీర్ణంలో వివిధ రకాల పంటలు సాగు చేయబడ్డాయి.  


10,395 మెట్రిక్‌ టన్నుల ఎరువులు...

జిల్లా వ్యాప్తంగా యాసంగి సీజన్‌లో సాగు చేయబడిన పంటలకు అవసరం మేరకు అధికారులు ఎరువులు సిద్ధంగా ఉంచా రు. యాసంగి సీజన్‌లో 5,300 మెట్రిక్‌ టన్నుల యూరియా, 1,611 మెట్రిక్‌ టన్నుల డీఏపీ, 1,712 మెట్రిక్‌ టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులు, 1,637 మెట్రిక్‌ టన్నుల పొటాష్‌, 135 మెట్రిక్‌ టన్నుల ఫాస్పేట్‌ ఎరువులు అవసరమని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఎరువుల పంపిణీకి అధికారులు ప్రతిపాదనలు పంపించడం జరిగింది. ఇదిలావుండగా యాసం గి సీజన్‌లో అవసరమైన మేరకు ఎరువులు అందుబాటులో ఉంచా రు. జిల్లాలో వరి, ఇతర పంటల సాగుకు 5,300 మెట్రి క్‌ టన్నుల యూరియా అవసరముండగా మార్క్‌ఫెడ్‌ దగ్గర 5,700 మెట్రిక్‌ టన్నుల యూరియా బఫర్‌ స్టాకు ఉందని వ్యవసాయాధికారులు తెలిపారు. తద్వారా యూరియా కొరత లేకుం డా ముందస్తుగానే స్టాకు ఏర్పాటు చేయించడం జరిగిందని వా రు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఏ ప్రాంతాలలోని రైతులకు యూరియా అవసరమైనా వెంటనే అందజేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. ప్రతి సంవత్సరం వలె ఈసారి కూడా ముందుగానే ఎరువులకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించి సకాలంలో జిల్లాకు ఎరువులు చేరుకునేలా అధికారులు తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. త ద్వారా జిల్లాలో సాగు చేయబడిన వివిధ రకాల పంటలకు అవసరం మేరకు అందజేసేందుకు ఎరువులు సిద్ధంగా ఉంచారు. 


అవసరం మేరకు ఎరువులు

జిల్లా వ్యాప్తంగా యాసంగి సీజన్‌లో అవసరం మేరకు ఎరువులు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. యాసంగిలో సాగు చేయబడిన పంటలకు అధికంగా యూరియా ఎరువులు అవసరమవుతాయి. జిల్లా వ్యాప్తంగా సాగు చేయబడిన పంటలకు 5,300 మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరమవగా ఇప్పటికే మార్క్‌ఫెడ్‌ వద్ద 5,700 మెట్రిక్‌ టన్నుల యూరియా బఫర్‌ స్టాకు ఉన్నది. మిగతా ఎరువులకు సైతం ఎలాంటి ఇబ్బంది లేదు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ అవసరం మేరకు ఎరువులు అందజేసేందుకు చర్యలు తీసుకున్నాం. ఎరువులకు ఎలాంటి కొరత లేదు.  

- గోపాల్‌, జిల్లా వ్యవసాయాధికారి logo