గురువారం 06 ఆగస్టు 2020
Vikarabad - Feb 01, 2020 , 23:46:55

సహకార ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ సత్తా చాటాలి

సహకార ఎన్నికల్లో  టీఆర్‌ఎస్‌ సత్తా చాటాలి

వికారాబాద్‌, నమస్తేతెలంగాణ : సహకార ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ సత్తా చాటాలని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, కార్మిక శాఖ మంత్రి మల్లారెడి పిలుపునిచ్చారు. రానున్న సహకార సొసైటీ ఎ న్నికలపై శనివారం హైదరాబాద్‌లోని మంత్రి సబితారెడ్డి చాంబర్‌లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జడ్పీ చైర్‌పర్సన్‌లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మం త్రులు మాట్లాడుతూ మున్సిపల్‌ ఎన్నికల మాదిరిగానే అన్ని సొసైటీలపై టీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేయాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు చేపట్టి దేశంలోనే అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. రైతు బంధు పథకం, రుణ మాఫీ సకాలంలో ఎరువుల పంపిణీ, సబ్సిడీ విత్తనాలు, రైతు బీమా తదితర వాటితో వ్యవసాయం దండగ అన్న వారికి పండుగలాగా సీఎం మార్చారని మంత్రులు అన్నారు. రెండేండ్లలో రైతు బీమా ద్వారా ఉమ్మడి జిల్లాలో వంద కోట్లకు పైగా 2,164 బాధిత రైతు కుటుంబాలకు అందించడం జరిగిందన్నారు. పంటల రుణ పరిమితిని కూడా పెంచడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏ ర్పాటు తర్వాత రాష్ట్రంలో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇ వ్వడం జరిగిందన్నారు. 


ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రైతు బంధు ద్వారా సుమారు 500 కోట్లు ప్రస్తుత సంవత్సరం రబీ, ఖరీఫ్‌ల్లో అందించడం జరిగిందన్నారు. అందులో ఖరీఫ్‌లో రూ.4.60 లక్షలకు పైగా రబీలో రూ. 3.67లక్షలకుపైగా అన్నదాతలకు రైతు బంధు ద్వారా లబ్ధి చేకూరిందన్నారు. సొసైటీల బలోపేతానికి అనేక చర్యలు తీసుకున్నట్లు, ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపుతో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. వివిధ సహకార సొసైటీలతో పాటు బ్యాంక్‌ల ద్వారా రైతులకు పెద్ద ఎత్తున రుణాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఎన్నికలు ఏవైనా ప్రజల మద్దతు టీఆర్‌ఎస్‌కే ఉంటుందని, వ్యవసాయదారులు పార్టీ వెంటే నడుస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. రైతుల మనస్సులను చూరగొని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని అన్ని స్థానాల్లో గెలుపొందాలన్నారు. ప్రభు త్వం రైతుల కోసం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న పథకాలు ప్రచారం చేయాలని వారు సూచించారు. సీఎం కేసీఆర్‌  ఒక రైతుగా రైతుల సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న వారని, సొసైటీల్లో టీఆర్‌ఎస్‌ గెలుపుతో అవి మరింత బలోపేతం అవుతాయని మంత్రులు  తెలిపారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్‌, వివేక్‌, రో హిత్‌రెడ్డి, మెతుకు ఆనంద్‌, సుభాశ్‌రెడ్డి, మహేశ్‌రెడ్డి, యాదయ్య, ఎమ్మెల్సీలు శంబిర్‌పూర్‌ రాజు, యేగ్గె మల్లేశం పాల్గొన్నారు. logo