శుక్రవారం 05 జూన్ 2020
Vikarabad - Feb 01, 2020 , 23:39:17

విద్యార్థులు క్రమశిక్షణను అలవర్చుకోవాలి

విద్యార్థులు క్రమశిక్షణను అలవర్చుకోవాలి

తాండూరు టౌన్‌ : సమాజంలో తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ అన్నారు. శనివారం తాండూరు మున్సిపల్‌ పరిధి మల్‌రెడ్డిపల్లిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు తాండూరు మార్వాడీ యువమంచ్‌ ఆధ్వర్యంలో 20 బెంచీలను పంపిణీ చేశారు. కార్యక్రమానికి హాజరైన డీఎస్పీ లక్ష్మీనారాయణ వార్డు కౌన్సిలర్‌ సాహు శ్రీలత, మంచ్‌ సభ్యులతో కలిసి పాఠశాలకు బేంచీలను అందజేశారు. ఈ సందర్భంగా డీఎస్పీతో పాటు పలువురు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణను అలవర్చుకోవాలన్నారు.  విద్యార్థులు ఇష్టపడి చదివితే వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తారని అన్నారు. అదేవిధంగా సమాజ హితం కోసం మార్వాడి యువమంచ్‌ చేస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మంచ్‌ జాతీయ సభ్యుడు మన్మోహన్‌ సర్డా, తాండూరు అధ్యక్షుడు కుంజ్‌ బిహారి సోని, కార్యదర్శి అనిల్‌ సర్డా, రాష్ట్ర కన్వినర్‌ సన్ని అగర్‌వాల్‌, సభ్యులు కిషన్‌ రాఠి, శ్రీకాంత్‌ పండిత్‌, ఆశిష్‌ సర్డా, రోహిత్‌ అగర్‌వాల్‌, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వాసుదేవ్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 


logo