శుక్రవారం 14 ఆగస్టు 2020
Vikarabad - Feb 01, 2020 , 00:22:00

ప్రజా సంక్షేమం దిశగా సీఎం పాలన

ప్రజా సంక్షేమం దిశగా సీఎం పాలన
  • హస్నాబాద్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం
  • ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి
  • తడి, పొడి చెత్త సేకరణపై ప్రజలు అవగాహన పెంచుకోవాలి
  • తడి, పొడి చెత్త సేకరణపై ప్రజలు అవగాహన పెంచుకోవాలి
  • స్వచ్ఛతకు ప్రభుత్వం రూ.333కోట్లు కేటాయింపుకొడంగల్‌, నమస్తే తెలంగాణ : ప్రజా సంక్షేమం దిశగా సీఎం కేసీఆర్‌ పరిపాలన కొనసాతుగుందని, అందులో భా గంగానే గ్రామాల స్వచ్ఛతకు గాను ప్రత్యేకంగా పల్లె ప్రగతి కార్యాచరణ ప్రణాళికను చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే ప ట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మం డల పరిధిలోని హస్నాబాద్‌ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ముందుగా గ్రామ ప్రధాన రోడ్డు ప్రాంతంలో శివాజీ, అంబేద్కర్‌ విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు గాను భూమి పూజ కార్యక్రమం, గ్రామంలో విజ్ఞానాన్ని అందించేందుకు గాను ప్రత్యేకంగా గ్రంథాలయాన్ని ప్రారంభించి, తడి, పొడి చెత్తకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు బుట్టలను పం పిణీ  చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె ప్రగతి ప్రత్యేక ప్రణాళికతో నేడు గ్రామాల్లో స్వచ్ఛ త వెల్లివిరుస్తుందని పేర్కొన్నారు. 

గ్రామాల స్వచ్ఛతకు ప్రభుత్వం రూ.333 కోట్ల ని ధులను మంజూరు చేయడం జరిగిందని, ప్రతి నెలా ప్రత్యేకంగా గ్రామ పంచాయతీలకు నిధులు మంజూ రు కాబడుతున్నట్లు తెలిపారు. 


నెల రోజుల పాటు గ్రా మంలో ప్రజా ప్రతినిధులతో పాటు అధికారులు ప్రత్యేక దృష్టి సారించి గ్రామ స్వచ్ఛతకు పాటు పడడం జరిగిందన్నారు. నేడు ప్రతి గ్రామానికి వైకుంఠధామం, డంపింగ్‌ యార్డుల ఏర్పాటు కావడం జరిగిందన్నారు. గ్రామాల్లోని చెత్తను డంపింగ్‌ యార్డులకు తరలించేందు కు వీలుగా ట్రాక్టర్‌, మొక్కలను కాపాడేందుకు నీటి ట్యాంకర్‌, స్థలం చదును చేసేందుకు డోజర్లను మంజూరు చేసి అందించ డం జరిగిందన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే గ్రామాలకు అభివృద్ధి దశ ఏర్పడిందన్నారు. తడి, పొడి చెత్తపై ప్రజలకు పూర్తి అవగాహన ఉండాలన్నారు. త డి, పొడి చెత్తను డంపింగ్‌ మార్డులకు తరలించడం వల్ల దోమల నివారణతో పాటు కంపోస్టు ఎరువును తయారు చేసుకోవడం వల్ల గ్రామ పంచాయతీకి అదనపు ఆదా యం సమకూరుతుందన్నారు. గతంలో గ్రామ వాతావరణం ఏ విధంగా ఉండేదో పల్లె ప్రగతి ప్రణాళికతో ప్రస్తుత గ్రామ వాతావరణం ఏ విధంగా ఉందో ఒక్కసారి గ్రహిస్తే పారిశుధ్యంపై ప్రజలకు పూర్తి అవగాహన ఏర్పడుతుందన్నారు. 


పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యం సాకారం అవుతుందన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజా సంక్షేమం కోసమే ఏర్పాటు చేయడం జరిగిందని వాటిని సద్వినియో గం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ సంకల్పానికి ప్రజా స్పం దన తోడైనప్పుడే పూర్తి స్థాయి విజయం వచ్చే అవకాశం ఉంటుందన్నారు. వచ్చే మార్చి నాటికి కొత్త బడ్జెట్‌లో 57 ఏండ్లు నిండిన వారికి ఆసరా పింఛన్‌ అందించడం జరుగుతుందన్నారు. గ్రంథాలయ భవన నిర్మాణానికి ప్రత్యేకంగా రూ.10లక్షల మంజూరుకు గాను నివేదిక అందించనున్న ట్లు ఎమ్మెల్యే తెలిపారు. గ్రామంలో శివాజీ, అంబేద్కర్‌ విగ్రహాలను ఏర్పాటు చేసే విధంగా ప్రజలు ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందని, వచ్చే అంబేద్కర్‌ జయంతి నాటికి విగ్రహాన్ని ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాలని తెలిపారు. ప్రజల కోరిక మేరకు మిషన్‌ కాకతీయ పథకం ఆధ్వర్యంలో హస్నాబాద్‌ చెరువు పూడికతీత పనులు చేపట్టే విధంగా కృషి చేయనున్నట్లు హామీ ఇచ్చారు. కార్యక్రమం లో ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్‌, సర్పంచ్‌లు, ఎంపీటీసీ విద్య, టీఆర్‌ఎస్‌ నాయకులు, టీఆర్‌ఎస్‌ పార్టీ గ్రామ అధ్యక్షుడు చంద్రశేఖర్‌, కో ఆప్షన్‌ సభ్యుడు ముక్తార్‌, గ్రామస్తులు పాల్గొన్నారు. 
logo