ఆదివారం 09 ఆగస్టు 2020
Vikarabad - Feb 01, 2020 , 00:11:46

పది’లో 100శాతం ఉత్తీర్ణత సాధించాలి

పది’లో 100శాతం ఉత్తీర్ణత సాధించాలి
  • విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలి
  • గాలికుంటు నివారణ, కృత్రిమ గర్భదారణ పోస్టర్లు ఆవిష్కరణ
  • విద్యాధికారులు, హెచ్‌ఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌
  • కలెక్టర్‌ మస్రత్‌ ఖానమ్‌ ఆయేషా

వికారాబాద్‌ రూరల్‌  : జిల్లాలోని అన్ని మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించి 10వ తరగతిలో 100శాతం ఫలితాలు వచ్చే లా చూడాలని విద్యాశాఖ అధికారులకు, ప్రధానోపాధ్యాయులకు, స్పెషల్‌ ఆఫీసర్లను కలెక్టర్‌ మస్రత్‌ ఖానమ్‌ ఆయేషా ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాలులో వీడియో కాన్ఫరెన్స్‌లో ఎంఈవోడబ్ల్యూ, హెచ్‌ఎంలకు సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ సంవత్సరం 10వ తరగతిలో జిల్లాలో 100శాతం ఫలితాలు సాధించేందుకు ప్రత్యేకాధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు నిరంతరం అన్ని మండలాల్లోని పాఠశాలలను సందర్శించాలన్నారు. మిగిలియున్న 47రోజుల్లో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి వెనుకబడిన సబ్జెక్టులలో విద్యార్థులకు మంచి శిక్షణ ఇవ్వాలన్నారు. విద్యార్థులందరికీ అవసరమైన స్టడీ మెటీరియల్‌ అందించి ప్రతిరోజు చదివించిన పాఠ్యాంశాలపై పరీక్షలు నిర్వహించాలని సూచించారు. విద్యార్థులందరూ పాఠాశాలలకు గైర్హాజరు కాకుండా చూడాలన్నారు. పేరెంట్స్‌ మీటింగ్‌లు నిర్వహించి పిల్లలు ప్రత్యేక తరగతులకు వచ్చేటట్లు చూడాలన్నారు. సీ గ్రేడ్‌ విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యే క శ్రద్ధ వహించాలని సూచించారు. 10/10 శాతం మార్కులు అధిక సంఖ్యలో సాధించే విధంగా చూడాలన్నారు. కార్యక్రమంలో డీఈవో రేణుకాదేవి, డీఆర్‌డీవో కృష్ణన్‌, డీపీవో రిజ్వానలతో పాటు ప్రత్యేక అధికారులు, ఎంఈవోలు పాల్గొన్నారు. 


logo