శుక్రవారం 05 జూన్ 2020
Vikarabad - Feb 01, 2020 , 00:11:10

మహిళల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

మహిళల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

వికారాబాద్‌ రూరల్‌ : శాంతి భద్రత పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం చేయరాదని, రోడ్డు ప్రమాదాలను నివారించాలని  ఐపీఎస్‌ వెస్ట్‌జోన్‌ ఐజీపీ ఎం. స్టీఫెన్వ్రీంద్ర పేర్కొన్నారు. శుక్రవారం వికారాబాద్‌ జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. జిల్లా పోలీసులు ఎస్పీ నారాయణ ఆధ్వర్యంలో గౌరవ వం దనం చేశారు. అనంతరం ఎస్పీ కార్యాలయంలోని  పచ్చదనం పరిశుభ్రతను పరిశీలించి హర్షం వ్యక్తం చేశారు. వివిధ విభాగాల పని తీరును తనిఖీ చేసి సిబ్బంది నిర్వహిస్తున్న పనులపై సలహాలు, సూచనలు అందజేశారు. జిల్లా హెడ్‌ క్వాటర్‌ను సందర్శించి సిబ్బంది నిర్వహిస్తున్న విధుల గురించి తెలుసుకొని, ఎస్కార్ట్‌, గార్డ్‌ ఏ విధంగా విధులు నిర్వహిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. 


ఈ సందర్భంగా ఐపీఎస్‌ వెస్ట్‌జోన్‌ ఐజీపీ ఎం. స్టీఫెన్వ్రీంద్ర మాట్లాడుతూ ఎస్కా ర్ట్‌, గార్డ్‌లు ఎటువంటి నిర్లక్ష్యం వహించరాదని సూ చించారు. మహిళల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని విధుల్లో ఎవరు కూడా నిర్లక్ష్యం వహించరాదన్నారు. శాంతి భద్రతల ను కాపాడటంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. డీజీపీ ఆదేశాల మేరకు పోలీ సు అధికారులు పనులు చేయాలన్నారు. మహిళల రక్షణ, రోడ్డు ప్రమాదల నివారణను బాధ్యతగా తీసుకొని ముందుకు వెళ్లాలన్నా రు. రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్రెండ్లీ పోలీసింగ్‌ విధానాన్ని ఎక్కడ విఘాతం కలిగించకుండా విధులు నిర్వహించాలన్నారు. ఆయన వెంట ఐపీఎస్‌ డీఐజీ ఎన్‌. శివశంకర్‌రెడ్డి, కార్యాలయ సిబ్బంది, ఎస్పీ నారాయణ, ఏఎస్పీ రషీద్‌, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. 


logo