గురువారం 13 ఆగస్టు 2020
Vikarabad - Feb 01, 2020 , 00:10:27

రోడ్డు నియమాలను పాటించి

రోడ్డు నియమాలను పాటించి
  • ప్రాణాలను కాపాడుకోవాలి
  • జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటేశ్వర్‌రెడ్డి

వికారాబాద్‌ టౌన్‌ : రోడ్డు నియమాలను పాటించి ప్రాణాలు కాపాడుకోవాలని, ఇతరులకు హాని కలిగించరాదని జిల్లా రవాణాశాఖ అధికారి వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం వికారాబాద్‌ పట్టణంలోని ఎన్‌టీఆర్‌ చౌరస్తాలో 31వ జాతీయ రహదారి భద్రత వారోత్సవాల్లో భాగంగా రోడ్డు నియమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రవాణశాఖ అధికారి వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులందరూ హెల్మెట్‌ ధరించాలని తెలిపారు. వాహన దారులందరికీ విద్యార్థులతో రోడ్డు భద్రత నియమావాళి పత్రాలను, గులాబీ పువ్వులను అందించడం జరిగిందన్నారు. వాహనలు నడిపేవారు నిర్ణిత స్పీడ్‌తో వాహనాలను నడుపాలన్నారు. ఫోర్‌ విల్లర్స్‌, ఇతర వాహనదారులు సిట్‌ బెల్ట్‌లను తప్పక వినియోగించాలన్నారు. ఇతర వాహనలకు ఇబ్బందులు కలుగకుండా వాహనలను నడిపించాలని తెలిపారు. పాదచారులు సైతం రోడ్డు నిబంధనలు పాటించాలని సూచించారు. కార్యక్రమానికి సాయి డెంటల్‌ కళాశాల విద్యార్థులు ఉన్నారు.


logo