గురువారం 13 ఆగస్టు 2020
Vikarabad - Feb 01, 2020 , 00:09:01

కుష్టు వ్యాధిగ్రస్తులను చిన్నచూపు చూడొద్దు

కుష్టు వ్యాధిగ్రస్తులను చిన్నచూపు చూడొద్దు
  • డీఎంహెచ్‌వో దశరథ్‌

వికారాబాద్‌ టౌన్‌ : కుష్టు వ్యాధి గ్రస్తులను చిన్న చూపు చూడరాదని, జిల్లా నుంచి కుష్టు వ్యాధిని తరిమి వేయాలని డీఎంహెచ్‌వో దశరథ్‌ అన్నారు. శుక్రవారం వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో ఉన్న అనంతగిరి కేజీబీవీ పాఠశాలలో కుష్టు వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో దశరథ్‌ మాట్లాడుతూ వ్యాధి గ్రస్తులను చిన్న చూపు చూడరాదన్నారు. సమాజంలో వారిని గౌరవించాలని, వారిని వివక్షకు గురిచేసి ఇబ్బందులకు గురి చేయరాదన్నారు. రోగంతో బయపడేవారికి ప్రజలు ఆసరాగ నిలిచి కుష్టు రోగులకు  ధైర్యం పెంచాలన్నారు. వ్యాధి గ్రస్తులకు చికిత్సలు ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందన్నారు. కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కుష్టు వ్యాధితో స్పర్షలేని వారు ఎవరైనా ఉంటే వెంటనే వైద్య సిబ్బందికి తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 


logo