శుక్రవారం 07 ఆగస్టు 2020
Vikarabad - Jan 29, 2020 , 23:59:15

పేదింటి పెండ్లికి సీఎం కేసీఆర్‌ కానుక

పేదింటి పెండ్లికి సీఎం కేసీఆర్‌ కానుక

మోమిన్‌పేట : మనసున్న మహారాజు మన సీఎం కేసీఆర్‌ అని ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మండల పరిధిలోని 74 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులతో పాటు, 18 మందికి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం 74 మ ందికి రూ. 74,08,584 డబ్బులను అందించారు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద రూ.7,27,500లను అందజేశారు. మండల పరిధిలోని చీమల్‌ధరి గ్రామ పంచాయతీకి పల్లె ప్రగతిలో భాగంగా కొనుగోలు చేసిన ట్రాక్టర్‌, వాటర్‌ ట్యాంక్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఇంటికీ సీఎం కేసీఆర్‌ పెద్ద కొడుకులా వ్యవహరిస్తూ పేదింట్లో పెండ్లి సంతోషంగా జరుపునకునేందుకు ఈ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని పేర్కొన్నారు. ప్రతి ఆడ బిడ్డకు రూ.1,00,116లు అందజేస్తున్న సీఎం కేసీఆర్‌ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం కేసీఆర్‌ అని కొనియాడారు. 


కులమతాలకు సంబంధం లేకుండా ప్రతి లబ్ధిదారులకు అందిస్తున్నారన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఫలాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని కుటుంబ అవసరాలకు వాడుకోవాలన్నారు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ను ప్రతి ఒక్క రూ వినియోగించుకుని లబ్ధిపొందాలన్నారు. కార్యక్రమం లో జడ్పీ వైస్‌ చైర్మన్‌ విజయ్‌కుమార్‌, ఎంపీపీ వంసత, ఎం పీడీవో శైలజారెడ్డి, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, సర్పంచ్‌ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు, సర్పంచ్‌ నర్సింహారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీవో శాంత, డీటీ రవీందర్‌, ఆర్‌ఐ రవీందర్‌, సర్పంచ్‌ లు, ఎంపీటీసీలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.


logo