గురువారం 06 ఆగస్టు 2020
Vikarabad - Jan 29, 2020 , 23:54:46

ఇంటి బిల్లుల వసూళ్లతోగ్రామాల ఆదాయాన్ని పెంచుకోవాలి

ఇంటి బిల్లుల వసూళ్లతోగ్రామాల ఆదాయాన్ని పెంచుకోవాలి
  • - మండల అధికారులు, ప్రజాప్రతినిధులతో కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌

కోట్‌పల్లి: గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం ఇంటి బిల్లులను క్రమం తప్పకుండా వసూళ్లు చేసి, పంచాయతీ ఆదాయాన్ని పెంచుకోవాలని కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో పంచాయతీ అధికారులను ఆదేశించారు. బుధవారం మండల తహాసీల్దారు కార్యాలయంలో ఎంపీడీవో, తహాసీల్దారు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లతో కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో కలెక్టర్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ... ఈ నెల 31వ తేదీ వరకు పంచాయతీల సర్పంచ్‌లు వెంటనే ట్రాక్టర్లు కొనుగోలు చేయాలని సూచించారు. గ్రామ పంచాయతీ ఖాతాల్లో నిధులు లేని యేడాల బ్యాంక్‌ లోన్‌, ప్రైవేటు లోన్‌లను తీసుకుని తప్పకుండా కొనుగోలు చేసుకోవాలని సూచించారు. అలాగే ప్రతి నెల క్రమం తప్పకుండా పంచాయతీకి సంబంధించిన విద్యుత్‌ బిల్లులను చెల్లించాలన్నారు. 


హరితహారాన్ని మరింత ఉధృతం చేసేందుకు గ్రామానికో నర్సరీని ఏర్పాటు చేయడం జరిగింది. వాటికి గెట్లు, పెన్సింగ్‌లను పూర్తి చేసుకుని, విత్తనాలను నాటుకునేందుకు మట్టిని నర్సరీలో స్టోరేజ్‌ చేసుకోవాలని సూచించారు. మొక్కల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అలాగే తహాసీల్దారు కార్యాలయంలో నిర్వహించిన కాన్ఫరెన్స్‌ సమావేశానికి సర్పంచ్‌లు హాజరు కావాల్సి ఉండగా, మహిళ సర్పంచ్‌ల స్థానంలో వారి భర్తలు సమావేశానికి హాజరైయ్యారు. మహిళాభివృద్ధికే మహిళలకు రిజర్వేషన్లు కల్పించి పదవులు కట్టబెడుతుంటే వారిని సమావేశాలకు రానివ్వకుండా ఇంటికే పరిమితం అవుతున్నారు. పదవుల్లో భార్యలు కొనసాగుతుంటే.. పెత్తనం మాత్రం భర్తల దా..? అనే విమర్శలు పలువురి నుంచి వ్యక్తం అవుతున్నాయి. 


logo