సోమవారం 03 ఆగస్టు 2020
Vikarabad - Jan 29, 2020 , 02:21:49

జిల్లా.. టీఆర్‌ఎస్‌ ఖిల్లా

జిల్లా.. టీఆర్‌ఎస్‌ ఖిల్లా
  • - ఎన్నికలు ఏవైనా విజయం కారుదే
  • - సర్పంచ్‌ నుంచి ఎమ్మెల్యేల వరకు అంతా గులాబీ దండే
  • - అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో అందరి చూపూ టీఆర్‌ఎస్‌వైపే
  • - ఇదివరకే అసెంబ్లీ, పంచాయతీ, పరిషత్‌, పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రభంజనం
  • - అన్ని పార్టీల నుంచి భారీస్థాయిలో చేరికలు
  • - తాజాగా నాలుగు మున్సిపాలిటీలపై రెపరెపలాడిన గులాబీ జెండా
  • - చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ స్థానాలు కైవసం
  • - జిల్లాలో ప్రతిపక్ష పార్టీల కథ ముగిసినట్లే..

- ఆసరా పింఛన్‌  వృద్ధులకు  అండగా నిలుస్తున్నది..

- కల్యాణ లక్ష్మి ఆడబిడ్డలను ఆదరిస్తున్నది..

- రైతుబంధు సాయమై సాగును ముందుకు సాగిస్తున్నది..

- బీమా పథకం బాధిత కుటుంబాలకు భరోసానిస్తున్నది..

- మిషన్‌ భగీరథ కరువు గ్రామాల్లోనూ దాహం తీరుస్తున్నది..

- మిషన్‌ కాకతీయ చెరువు, కుంటలకు జలకళను తెస్తున్నది..

- పల్లె ప్రగతి గ్రామాల రూపురేఖలను మారుస్తున్నది... 

- ..ఇలా ఒకటా, రెండా ఎన్నెన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు గడప గడపకు చేరుతున్నాయి. సుపరిపాలనకు నిదర్శనంగా నిలుస్తున్నాయి..

..అందుకే ఎన్నికలు ఏవైనా, ప్రత్యర్థులు ఎవరైనా, ప్రజా మద్దతు  సీఎం కేసీఆర్‌కే దక్కుతున్నది.. విజయం టీఆర్‌ఎస్‌నే వరిస్తున్నది.


వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో టీఆర్‌ఎస్‌ తిరుగులేని శక్తిగా దూసుకుపోతున్నది. కారు దూకుడుతో ప్రతిపక్ష పార్టీలు కకావికలం అయ్యాయి. ఇప్పటికే కాంగ్రెస్‌, బీజేపీ తదితర పార్టీల ముఖ్యనేతలు ఒక్కొక్కరిగా గులాబీ పార్టీలో చేరడంతో ప్రతిపక్షాలు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి. అసెంబ్లీ, పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో సత్తా చాటిన టీఆర్‌ఎస్‌ తాజాగా మున్సిపల్‌ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించింది. నాలుగు పురపాలికల్లో మెజార్టీ కౌన్సిలర్లతో పాటు చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ స్థానాలను కైవసం చేసుకున్నది. ప్రస్తుతం జిల్లాలో 355 సర్పంచ్‌లు, 137మంది ఎంపీటీసీలు, 15మంది జడ్పీటీసీలు, 14మంది ఎంపీపీలతో బలమైన పార్టీ శ్రేణులను కలిగి ఉంది. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పీఠాన్ని కూడా అధికార పార్టీ  సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ దిశానిర్దేశంతో జిల్లా ఎమ్మెల్యేలు ముందుకు సాగుతుండడమే ఈ సక్సెస్‌కు ప్రధాన కారణంగా చెప్పవచ్చు.   


జిల్లాలో అధికార పార్టీదే జోరు కొనసాగుతుంది. జిల్లాలో రాజకీయంగా మిగతా అన్ని పార్టీల కంటే బలంగా తయారైంది. గతంలో టీడీపీకీ కంచుకోటగా ఉన్న జిల్లా టీఆర్‌ఎస్‌కి కంచుకోటగా మారిం ది. ఎన్నికలు ఏవైనా జోరు గులాబీ పార్టీదే కొనసాగుతుంది. జిల్లాలో చిన్న చిన్న పదవుల నుంచి పార్లమెంట్‌ సభ్యులు, శాసనసభ్యుల వరకు అంతా గులాబీ పార్టీదే జోరు కొనసాగుతుంది. జిల్లాలో కారు దూకుడుతో ప్రతిపక్ష పార్టీలకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి జిల్లాలో అధికార పార్టీ దూకుడును ప్రదర్శిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడంతో ఆయా పార్టీల నేతలతో పాటు సామాన్య ప్రజానీకం కూడా సాహో కేసీఆర్‌ అంటూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి జై కొడుతున్నారు. అంతేకాకుండా ఒక్కొక్కరిగా కాంగ్రెస్‌ తదితర పార్టీలను వీడి గులాబీ కండువాలు కప్పుకున్నారు. చోటా, మోటా నేతల నుంచి కార్యకర్తల వరకు అంతా గులాబీ పార్టీలోకి చేరా రు. అంతేకాకుండా ఇటీవల జరిగిన మున్సిపల్‌, అసెంబ్లీ, పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో వార్‌ వన్‌సైడ్‌ అనే విధంగా టీఆర్‌ఎస్‌ పార్టీకే జిల్లా ప్రజలు వరుస విజయాలను అందించారు. అదే విధంగా వరుస విజయాలతో అధికార పార్టీ ఊపుమీదుంటే మరోవైపు కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీల నేతలకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. జిల్లాలో కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీలకు కాలం చెల్లినట్లేనని, ఇక భవిష్యత్‌ అంతా టీఆర్‌ఎస్‌దేనని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జిల్లాలో టీఆర్‌ఎస్‌ ప్రభంజనం, బలోపేతంలో సీఎం కేసీఆర్‌ అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, పార్టీ వర్కిం గ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ దిశానిర్దేశంతో జిల్లా ఎమ్మెల్యేలు ముందు కు సాగుతుండడమే ఈ సక్సెస్‌కు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. 


సర్పంచ్‌ నుంచి ఎమ్మెల్యే వరకు...

జిల్లాలో టీఆర్‌ఎస్‌ పటిష్టంగా తయారైంది. మునుపెన్నడూ లేని విధంగా జిల్లాలో సర్పంచ్‌ నుంచి ఎమ్మెల్యేల వరకు అంతా టీఆర్‌ఎస్‌ వారినే ప్రజలు గెలిపించుకోవడంతో జిల్లాలో తిరుగులేని పార్టీగా టీఆర్‌ఎస్‌ అవతరించింది. 2014లో పార్టీ తొలిసారి అధికారంలోకి వచ్చిన సమయంలోనూ జిల్లాలో అంతంతాగానే ఉన్న టీఆర్‌ఎస్‌ ప్రస్తుతం జిల్లాలో ఏ ఎన్నికలు జరిగినా టీఆర్‌ఎస్‌ ప్రభంజనం కొనసాగుతుంది. జిల్లా లో అధికార పార్టీ బలోపేతంతో సర్పంచుల నుంచి ఎమ్మెల్యేల వరకు టీఆర్‌ఎస్‌వారే కొనసాగుతుండడం గమనార్హం. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలుండగా మూడు నియోజకవర్గాల్లో గులాబీ విజయదుందిభి మోగించింది. జిల్లాలోని వికారాబాద్‌, పరిగి, కొడంగల్‌ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను గెలిపించారు. 2014ఎన్నికల్లో జిల్లాలోని తాండూర్‌, వికారాబాద్‌ నియోజకవర్గాల్లోనే టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఉండగా 2019ఎన్నికల్లో జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లోనూ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఉన్నారు. మరోవైపు పంచాయతీ ఎన్నికల్లోనూ వార్‌ వన్‌సైడ్‌లా టీఆర్‌ఎస్‌ విజయభేరి మోగించింది. జిల్లాలో 565 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగగా.. 355గ్రామ పంచాయతీల్లో టీఆర్‌ఎస్‌ ప్రభంజనం సృష్టించింది. పరిషత్‌ ఎన్నికల్లోనూ గులాబీ జోరు కొనసాగింది. జిల్లా లో మొత్తం 221ఎంపీటీసీ స్థానాలుండగా 137ఎంపీటీసీ స్థానాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. అదే విధంగా జడ్పీటీసీ స్థానాల్లోనూ టీఆర్‌ఎస్‌ హవా కొనసాగింది. జిల్లాలో 18జడ్పీటీసీ స్థానాలుండగా 15 జడ్పీటీసీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ గెలుపొందింది. అయితే మిగతా జడ్పీటీసీలు కూడా త్వరలో టీఆర్‌ఎస్‌లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అదే విధంగా ఎంపీపీ అధ్యక్షపీఠాలకు సంబంధించి టీఆర్‌ఎస్‌ మెజార్టీ ఎంపీపీ పీఠాలను కైవసం చేసుకుంది. జిల్లాలో 18ఎంపీపీ పీఠాలుండగా 14ఎంపీపీ అధ్యక్ష పీఠాలను టీఆర్‌ఎస్‌ సొంతం చేసుకుంది. అంతేకాకుండా జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పీఠాన్ని కూడా అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ సొంతం చేసుకోవడం జరిగింది. 


అభివృద్ధి, సంక్షేమ పథకాలే కొండంత బలం...

జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ బలోపేతం కావడాని కి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రధానం అని చెప్పవచ్చు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తూ ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి అన్ని వర్గాల ప్రజలు జేజేలు కొడుతున్నారు. ఏ దిక్కులేని వారికి అండగా నిలిచేందుకు ఆసరా పథకాన్ని టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం అమల్లోకి తీసుకువచ్చింది. వృద్ధాప్య, వితంతువులు, వికలాంగులకు అండగా నిలిచేందుకుగాను ఆసరా పథకాన్ని తీసుకువచ్చి రూ. 200ల పింఛన్‌ను రూ. 1000ల కు, రూ. 500ల పింఛన్‌ను రూ. 1500లకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెంచింది. తదనంతరం రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆసరా పింఛన్లను రూ. 1000ల నుంచి రూ. 2016లకు, దివ్యాంగుల పింఛన్లను రూ. 1500ల నుంచి రూ. 3016లకు పింఛన్‌ డబ్బులను పెంచుతూ నిర్ణయించింది. పెంచిన పింఛన్లను ఇప్పటికే ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. ఆసరా పథకంతో పాటు ఆహార భద్రత పథకాన్ని ప్రవేశపెట్టి పేద ప్రజలకు కడుపు నిండా భోజనం పెట్టాలనే ఉద్దేశంతో కుటుంబ సభ్యుల సంఖ్యతో నిమిత్తం లేకుండా కుటుంబంలో ఎంతమంది ఉన్నప్పటికీ అందరికి ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున పంపిణీ చేస్తుంది. అదే విధంగా ఇంటింటికీ నల్లా ద్వారా తాగునీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా మిషన్‌ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టి జిల్లా ప్రజలకు రూ. 1187 కోట్లతో పనులు పూర్తి చేసి 971ఆవాసాలకు, నాలుగు మున్సిపాలిటీలకు తాగు నీరందిస్తున్నారు. అదే విధంగా చెరువులకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు మిషన్‌ కాకతీయ, పేద కుటుంబాలకు చెందిన ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక చేయూతనందించేందుకు కల్యాణలక్ష్మి, షాది ముబారక్‌ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుంది. అంతే కాకుండా అన్నదాతలను అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను చేపడుతుంది. జిల్లాలో రైతుబంధు పథకంలో భాగంగా రైతులను అప్పుల ఉబి లో నుంచి బయటపడేసేందుకు వానకాలం, యాసంగి సీజన్‌లకు కలిపి ఎకరాకు రూ. 8వేల పెట్టుబడి సాయాన్ని అందించిన ప్రభుత్వం ప్రస్తుతం ఎకరాకు రూ. 10వేల ఆర్థిక సహాయాన్ని రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా ప్రభుత్వం జమ చేస్తుంది. 


అదేవిధంగా ఏదేని రైతు మరణిస్తే సంబంధిత రైతు కుటుంబాన్ని ఆదుకునేందుకు రూ. 5లక్షల బీమాను ప్రభుత్వం అందజేస్తుంది. సంక్షేమ పథకాలతో పాటు కోట్ల రూపాయాలతో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుంది. జిల్లాలోని ప్రతి గ్రామానికి రోడ్లు వేయించడంతో పాటు గ్రామాల నుంచి మండలాలకు, మండలాల నుంచి జిల్లా కేంద్రానికి లింక్‌ రోడ్లు, ప్రతి గ్రామ పంచాయతీల్లోనూ సీసీ రోడ్లు ఏర్పాటుకు భారీగా నిధులు ప్రభుత్వం వెచ్చించింది. అదే విధంగా జిల్లాలోని ఆర్‌ అండ్‌ బీ రోడ్ల నిర్మాణానికి రూ. 930కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. జిల్లాలోని పంచాయతీరాజ్‌ రోడ్ల నిర్మాణానికి రూ. 250 కోట్లను ప్రభు త్వం విడుదల చేసింది. అంతేకాకుండా రోడ్ల మరమ్మతులకు ఈ నాలుగేండ్లలో జిల్లాకు 120కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. జరిగింది. జిల్లాలోని ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రానికి, మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి లింక్‌ రోడ్ల అభివృద్ధికి రూ. 802కోట్లను ప్రభు త్వం విడుదల చేసింది. అదే విధంగా తాండూరు నియోజకవర్గంలోని కాగ్నా వాగుపై రెండు వంతెనలను నిర్మించేందుకు ప్రభుత్వం రూ. 30 కోట్లను విడుదల చేసింది. అదే విధంగా మిషన్‌ కాకతీయ పథకంలో భాగంగా జిల్లావ్యాప్తంగా 1142 చెరువులుండగా నాలుగు విడుతల్లో భాగంగా 757చెరువులకు అనుమతులను మంజూరు చేయడంతో నిధులను మం జూరు చేసింది. 


జిల్లా వ్యాప్తంగా చెరువుల పునరుద్ధరణ పనులకు నాలుగు విడుతల్లో రూ. 229కోట్ల నిధులను టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం విడుదల చేసింది. అదే విధంగా ఒక్క కొడంగల్‌ నియోజకవర్గ అభివృద్ధికే రాష్ట్ర ప్రభుత్వం రూ. 150కోట్లకు పైగా ఆయా అభివృద్ధి పనులకు ఖర్చు చేసింది. కొడంగల్‌ నియోజకవర్గంలోని రోడ్లు లేని గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఏకంగా బీటీ రోడ్ల అభివృద్ధికి గాను రూ.80 కోట్ల నిధులను, కమ్యూనిటీ భవ న నిర్మాణాలకు రూ. 18కోట్లు, సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. 32 కోట్లు మంజూరు చేశారు. అంతే కాకుండా కొస్గి మండల కేంద్రంలో బస్‌ డిపో, కొడంగల్‌ నియోజకవర్గ కేంద్రం లో పైర్‌స్టేషన్‌ను, కొస్గి మండల కేంద్రంలో పోలీస్‌ సర్కి ల్‌ కార్యాలయాన్ని, అదే విధంగా కొడంగల్‌ నియోజకవర్గంలోని బొంరాసుపేట్‌, దౌల్తాబాద్‌ మండల కేంద్రాల్లో జూనియర్‌ కాలేజీలను ఏర్పాటు కొనసాగుతుంది. కుల వృత్తులకు పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేస్తున్న ప్రభుత్వం గొల్ల కురుమలకు రాయితీపై గొర్రెల పంపిణీ చేయడంతో గొల్ల, కుర్మల్లో ఆనందోత్సహం మొదలైంది. జిల్లా వ్యాప్తంగా 22వేల యాదవ సంఘ సభ్యులకు ఇప్పటీ వరకు రూ. 117కోట్లతో 10,444మంది సభ్యులకు గొర్రెలను పంపిణీ చేశారు. అదే విధంగా మున్సిపాలిటీల అభివృద్ధికి రూ. 80కోట్ల నిధులను ఇప్పటికే విడుదల చేయగా, పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి.


logo