బుధవారం 12 ఆగస్టు 2020
Vikarabad - Jan 28, 2020 , 02:21:33

గులాబీ జెండా ఎగురవేస్తాం

గులాబీ జెండా ఎగురవేస్తాం
  • వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌
  • కాంగ్రెస్‌ యువజన నాయకుడు సుభాన్‌రెడ్డి, కార్యకర్తలు పార్టీలో చేరిక

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ: మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేస్తామని వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ అన్నారు. వికారాబాద్‌ మున్సిపాలిటీలోని 33వ వార్డుకు చెందిన కాంగ్రెస్‌ యువజన నాయకుడు సుభాన్‌రెడ్డితో పాటు సుమారుగా 150 మందికి పైగా కార్యకర్తలు ఎమ్మెల్యే ఆనంద్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేస్తామని, అన్ని వార్డుల్లో బరిలో నిలిచే పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను తప్పక గెలిపించాలని, వారితోనే అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. టీఆర్‌ఎస్‌  ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే పార్టీని గెలిపిస్తాయన్నారు. ఈ సందర్భంగా సుభాన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు నచ్చి పార్టీలో చేరడం జరిగిందని, ప్రజలకు మంచి చేసే ప్రభుత్వంతో  కలిసి పనిచేసేందుకు ముందుంటాన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు అనంత్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, విజయ్‌కుమార్‌, కమాల్‌రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.logo