శనివారం 08 ఆగస్టు 2020
Vikarabad - Jan 28, 2020 , 00:03:17

పజల నమ్మకాన్ని నిలబెట్టాలి

పజల నమ్మకాన్ని నిలబెట్టాలి


ఇబ్రహీంపట్నం, నమస్తే తెలంగాణ : కొత్తగా ఎన్నికైన చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు, కౌన్సిలర్లు ప్రజల అభిమానాన్ని చూరగొని ప్రభుత్వ పథకాలను వారికి అందేలా చూ డాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గం నుంచి కొత్తగా ఎన్నికైన చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు, కౌన్సిలర్లతో సోమవారం ప్రత్యేక సమావేశాన్ని క్యాం పు కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నందున మున్సిపాలిటీలు మరింత అభివృద్ధి చెందాలంటే ఆ పార్టీకి చెందినవారినే గెలిపించాలని ఆకాంక్షించారని, వారి ఆకాంక్షకు అనుగుణంగా ప్రజాప్రతినిధులంతా పనిచేసి వారి నమ్మకాన్ని మరింత చూరగొనాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో నాలుగు మున్సిపాలిటీలున్నాయని ఈ మున్సిపాలిటీలకు ప్రభు త్వం నుంచి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించడానికి కృషిచేస్తామ న్నారు. ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించి పెద్దఎత్తున నిధులు కేటాయించిందని, ఇకనుంచి మున్సిపాలిటీల్లో పట్టణ ప్రగతి కార్యక్రమాలను నిర్వహించి అత్యధికంగా నిధులు కేటాయిస్తుందన్నారు. కొత్తగా ఎన్నికైన చైర్మన్లు, కౌన్సిలర్లు కష్టపడి పనిచేసి మున్సిపాలిటీలను అభివృద్ధిపథంలో నడిపించాలని అందుకు అవసరమైన నిధులు ప్రభుత్వం ద్వారా తీసుకురానున్నట్లు తెలిపారు. నాలుగు మున్సిపాలిటీలకు మహిళా ప్రజాప్రతినిధులే చైర్మన్లు కావడం వల్ల ఈ ప్రాంతాలు మ రింత అభివృద్ధి చెందుతాయని అన్నారు.


పట్నం నియోజకవర్గంలో ఎంపీ కోమటిరెడ్డి ఆటలు సాగనీయ...

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దౌర్జన్యం ద్వారా ఇబ్రహీంపట్నంలో రాజకీయం చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆయన ఆటలు ఇకనుంచి సాగనిచ్చే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే అన్నారు. సోమవారం ఆదిబట్ల మున్సిపాలిటీలో ప్రశాంతంగా చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికలు జరుగుతుండగా ఎక్స్‌ అఫిషియో నెంబర్‌గా ఓటు వేయడానికి వచ్చి నానా రభస సృష్టించారని ఎన్నికల అధికారి చేతిలో ఉన్న పేపర్లను లాక్కుని చించివేశారని, మహి ళ అని కూడా చూడకుండా ఆమెను కూడా నెట్టివేశారని అన్నారు. వెంటనే ఆయనపై కేసు నమోదు చేయాలని అధికారులను కోరారు. ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నారన్నారు. నియోజకవర్గంలో పెద్దఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, అభివృద్ధిని గుర్తించి ప్రజలు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని ప్రయత్నిస్తుండగా, ఎంపీ దౌర్జన్యం చేయాలనుకోవడం సహించరాని చర్య అన్నారు. 


logo