శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Vikarabad - Jan 27, 2020 , 05:16:25

టీఆర్‌ఎస్‌లో చేరిన స్వతంత్ర అభ్యర్థి సువర్ణ

టీఆర్‌ఎస్‌లో చేరిన స్వతంత్ర అభ్యర్థి సువర్ణ

వికారాబాద్‌ టౌన్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజా సంక్షమం కోరే వారిని ఎప్పుడైనా ఆహ్వానిస్తుందని వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌  అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో స్వతంత్ర అభ్యర్థి సువర్ణకు కండువా కప్పి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ మాట్లాడారు. వికారాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని 30వ వార్డులో ఇండిపెండెంట్‌ ఆభ్యర్థి సువర్ణ  పోటీ చేసి గెలిచిందన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రజా సంక్షేమం కోసం పని చేసే వారిని పార్టీలోకి ఆహ్వానిస్తామన్నారు. పార్టీలోకి చేరిన ప్రతి ఒక్కరూ ప్రజలకు సేవ చేయాలని తెలిపారు. అలాగే ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు చేరచేయాలని తెలిపారు.   మున్సిపల్‌ ఎన్నికలో టీఆర్‌ఎస్‌ 24 మంది అభ్యర్థులను గెలిపించుకోవడం జరిగిందని, అలాగే 30వ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన సువర్ణ పార్టీలోకి రావడంతో పార్టీకి మరింత బలం చేకురిందని తెలిపారు. నాయకులందరూ టీఆర్‌ఎస్‌ వైపు చూస్తున్నారని తెలిపారు. అనంతరం సువర్ణను ఎమ్మెల్యే ఆనంద్‌ అభినందించారు. కార్యక్రమంలో పలువురు  నాయకులు పాల్గొన్నారు.


logo