బుధవారం 05 ఆగస్టు 2020
Vikarabad - Jan 27, 2020 , 05:15:08

తహసీల్దార్‌ కార్యాలయంపై జాతీయ జెండా

తహసీల్దార్‌ కార్యాలయంపై జాతీయ జెండా

బషీరాబాద్‌: మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంపై జాతీయ జెండా ఆలస్యంగా ఎగిరింది.  గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తహసీల్దార్‌ కార్యాలయంపై జాతీయ జెండాను ఎగరవేసేందుకు ఎంపీపీ కరుణ, జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి,ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే అక్కడా తహసీల్దార్‌ వేపచేదు ఉమామహేశ్వరి లేదు. దీంతో అక్కడి నుంచి వేరే కార్యాలయాలపై జెండాను ఆవిష్కరించేందుకు వెళ్లారు. మళ్లీ ఒక్కసారి చూద్దమని ఎంపీపీ, జడ్పీటీసీలతో పాటు, ఇతర ప్రజాప్రతినిధులు, విద్యార్థులు తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకున్నారు. అయినప్పటికీ తహసీల్దార్‌  రాలేదు. 


దీంతో చేసేది ఏమీ లేక ఎంపీపీ, జడ్పీటీసీ, వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మండలానికి మెజిస్ట్రేట్‌ అయిన ఈమెనే సమయపాలన పాటించకపెవడం ఏమిటని పలు పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, దేశాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తొమ్మిది గంటలు దాటిన తరువాత తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకుని కార్యాలయ సిబ్బందితో కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు.


logo