సోమవారం 10 ఆగస్టు 2020
Vikarabad - Jan 27, 2020 , 05:14:03

పాసులు చెల్లవు టికెట్లు తీసుకోవాలి

 పాసులు చెల్లవు టికెట్లు తీసుకోవాలి
  • -విద్యార్థులపై వికారాబాద్‌ డిపో కండక్టర్‌ జులూం

వికారాబాద్‌ టౌన్‌: వికారాబాద్‌ డిపోకు చెందిన ఓ కండక్టర్‌ ఆదివారం విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించారు. విద్యార్థులు ఆదివారం గణతంత్ర దినోత్సవ   ముగిసిన తరువాత శంకర్‌పల్లి నుంచి  నవాబ్‌పేట్‌ మీదిగా బస్సు వికారాబాద్‌ వస్తుంది. నవాబ్‌పేట్‌ మండలంలోని ఎక్‌మామిడికు చెందిన విద్యార్థులు  మండలంలోని వివిధ ప్రైవేట్‌, ప్రభుత్వ కళాశాలలో విద్యాను అభ్యసిస్తున్నారు. గణతంత్ర దినోత్సవానికి వెళ్లి వస్తున్న సమయంలో బస్సులో ఎక్కిన తర్వాత బస్సు కండక్టర్‌ ఆసభ్యంగా ప్రవర్తించిందని విద్యార్థులు వాపోయారు. పాసులు నడవవని, డబ్బులు లేకపోతే అడుక్కొని ఐనా టికెట్‌ తప్పని సరిగా తీసుకోవాలని అన్నారు. లేకపోతే రోడ్డు మధ్యలో నిలిపి దించి వేస్తానని తెలిపారు.  ఉదయం బస్సు పాసులు నడిచాయని, మధ్యాహ్నం ఎందుకు నడవవని నిలదీశారు.  ఈ విషయంపై డీఎం హరికి ఫిర్యాదు చేశామని విద్యార్థులు తెలిపారు.


logo