శనివారం 15 ఆగస్టు 2020
Vikarabad - Jan 27, 2020 , 05:08:53

రెపరెపలాడిన జాతీయ జెండా

రెపరెపలాడిన జాతీయ జెండా

పరిగి నమస్తే తెలంగాణ/పరిగి రూరల్‌/కులకచర్ల /పూడూరు/ దోమ : 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలను నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఘనంగా నిర్వహించారు. ఆదివారం మండలాలతో పాటు పలు గ్రామాల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, గ్రామ పంచాయతీ భవనాల వద్ద సర్పంచ్‌లు, పార్టీ, యువజన సంఘాల కార్యాలయాల ముందు ఆయా సంఘాల నాయకులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. పరిగి మండలం నస్కల్‌, చిట్యాల్‌, ఖుదావంద్‌పూర్‌ పాఠశాలలో విద్యార్థులచే ఉపాధ్యాయులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వివిధ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కులకచర్ల బాలికల ఉన్నత పాఠశాలలో కులకచర్ల మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులచే వివిధ సాస్కృతిక కార్యక్రమాలు ఎంపీపీ సత్యమ్మహరిశ్చంద్ర ఆధ్వర్యంలో

ఆవిష్కరించారు. పరిగి మండలం నస్కల్‌, చిట్యాల్‌, ఖుదావంద్‌పూర్‌ పాఠశాలలో విద్యార్థులచే ఉపాధ్యాయులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వివిధ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
కులకచర్ల బాలికల ఉన్నత పాఠశాలలో


కులకచర్ల మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులచే వివిధ సాస్కృతిక కార్యక్రమాలు ఎంపీపీ సత్యమ్మహరిశ్చంద్ర ఆధ్వర్యంలో 


నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శనలను పలువురు తిలకించారు. కులకచర్ల బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు భారీ జాతీ య జెండాతో ప్రదర్శన, ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా మండలంలో ఉత్తమ సేవలు అందించిన 8మందికి మండ ల స్థాయిలో ఎంపీపీ సత్యమ్మహరిశ్చంద్ర, జడ్పీటీసీ రాందాస్‌నాయక్‌లు అందజేశారు.


పరిగిలో..

పరిగిలోని కోర్టు వద్ద జూనియర్‌ సివిల్‌ జడ్జి భారతి, పల్లవి విద్యాసంస్థలు, మదర్సా వద్ద ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి, తమ నివాసం వద్ద మాజీ ఎమ్మెల్యే టీ. రాంమోహన్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ కార్యాలయం వద్ద మార్కెట్‌ చైర్మన్‌ అజారుద్దీన్‌, మండల పరిషత్‌ పాత భవనం వద్ద జడ్పీటీసీ హరిప్రియ, డీఎస్పీ కార్యాలయం వద్ద డీఎస్పీ శ్రీనివాస్‌, తహసీల్దార్‌ కార్యాలయం వద్ద తహసీల్దార్‌ విద్యాసాగర్‌రెడ్డి, పీఏసీఎస్‌ భవనం వద్ద పీఏసీఎస్‌ చైర్మన్‌ కొప్పుల శ్యాంసుందర్‌రెడ్డి, మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ఎంపీడీవో కృష్ణకుమార్‌, ఆర్టీసీ డిపోలో డిపో మేనేజర్‌ బద్రినారాయణ, వివిధ ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆయా శాఖల అధికారులు జాతీయ జెండాను ఎగురవేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ పాఠశాలల చిన్నారులు జాతీయ నాయకుల వేషధారణలతో ప్రభాతభేరిలో పాల్గొని అందరినీ ఆకర్షించారు. పల్లవి కళాశాలలో నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలకు ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి బహుమతులు అందజేశారు.logo