గురువారం 06 ఆగస్టు 2020
Vikarabad - Jan 25, 2020 , 23:52:15

యువత ఓటరుగా నమోదు చేసుకోవాలి

యువత ఓటరుగా నమోదు చేసుకోవాలి
  • ఉప తహసీల్దార్‌ రాజేందర్‌రెడ్డి


దోమ : దోమ మండల పరిధిలో శనివారం దోమ, బొంపల్లి గ్రామాల్లో జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ఉప తహసీల్దార్‌ రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యలయం నుంచి అంబేద్కర్‌ కూడలీ వరకు పాఠశాల విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఉప తహసీల్దార్‌ రాజేందర్‌రెడ్డి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలన్నారు.  18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసగిగా ఓటు హక్కును నమోదు చేసుకోవాలన్నారు. బొంపల్లిలో జాతీయ ఓటరు దికోత్సవాన్ని పురస్కరించుకుని సర్పంచ్‌ కోళ్ల సురేశ్‌ పాఠశాల విద్యార్థులతో ర్యాలీ తీశారు.  కార్యక్రంలో తహసీల్దార్‌ సిబ్బంది రాజేందర్‌, లింగం, ప్రణయ్‌, నవీన్‌, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, బొంపల్లి ఎంపీటీసీ రాములు, కార్యదర్శి జైకిషన్‌, గ్రామస్తులు పాల్గొన్నారు.

కులకచర్లలో..

కులకచర్ల : జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కులకచర్ల మండల పరిధిలోని బజ్జనాయక్‌తండాలో  సర్పంచ్‌ శోభరమేశ్‌ ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ చేయించారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేయించుకోవాలని అన్నారు.  ఈ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు.  

ఓటరు డే సందర్భంగా ముగ్గుల పోటీలు

పూడూరు : మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని ఎంపీడీవో ఉష పేర్కొన్నారు. పూడూరు మండలం మహిళ సమాఖ్య (ఐకేపీ) అధికారుల ఆధ్వర్యంలో  పలు ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ఓటర్‌ డే సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో ఉష మాట్లాడారు. మహిళలు తప్పనిసరిగా ఓటర్‌ లిస్టులో పేర్లు నమోదు చేయించుకొని రాజకీయంగా ఎదుగాలన్నారు.   ఓటర్‌ డే సందర్భంగా పలువురు మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించారు. చక్కటి ముగ్గులు వేసిన  వారిలో మొదటి బహుమతి ఎన్కెపల్లి అనిత, రెండో బహుమతి పూడూరు సంతోష, మూడో బహుమతి కండ్లపల్లి సునీతలకు అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఎంపీటీసీ రామకృష్ణారెడ్డి, ఏపీఎం బందయ్య, ఐకేపీ సిబ్బంది, మహిళలు ఉన్నారు.logo