మంగళవారం 04 ఆగస్టు 2020
Vikarabad - Jan 25, 2020 , 23:01:48

సమయానికి తెరుచుకోని ఎంపీడీవో కార్యాలయం

సమయానికి తెరుచుకోని  ఎంపీడీవో కార్యాలయం


కొడంగల్‌ రూరల్‌: పట్టణంలోని  ఎంపీడీవో  సమయానికి తెరవక పోవడంతో పంచాయతీ కార్యదర్శులు బయట కూర్చున్నారు.  ఎంపీవో ఆదేశాల మేరకు  పంచాయతీ కార్యదర్శులు  మండల కార్యాలయానికి శనివారం ఉదయం 10.30 గంటలకు  వస్తే కార్యాలయం మూసి ఉండటంతో వివిధ గ్రామాలకు  చెందిన పంచాయతీ కార్యదర్శులందరూ బయట నిరీక్షించారు. ముఖ్యంగా మహిళా కార్యదర్శులు ఇబ్బందులు పడ్డారని రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల సంఘం ఉపాధ్యక్షుడు రమేశ్‌ అన్నారు. పంచాయతీ కార్యదర్శుల పై కొందరు అధికారులు  వివక్షకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని వాపోయారు. గ్రామాల్లో విధులు నిర్వహిస్తున్న తమను సమయానుసారంగా కార్యాలయానికి  రావాలని చెప్పిన ఎంపీవో ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శులమంతా మండల కార్యాలయానికి  వస్తే కార్యాలయం మూసి ఉండటంతో  తీవ్రంగా మనస్థాపానికి గురయ్యారని వారు పేర్కొన్నారు.  
ఉదయం పదిన్నర గంటలు దాటినప్పటికీ కార్యాలయం ద్వారాలు తాలం వేసి ఉండటంతో  తాము ఎక్కడ ఉండాలో తెలియడం లేదన్నారు. మండల కార్యాలయంలో కొన్నాళ్లుగా ప్రధాన అధికారులు తమను వివక్షకు గురి చేస్తున్నారని  తెలిపారు. గ్రామాల్లో పనిభారం ఎక్కువగా ఉంటుందని,అలాగే అధికారులు సైతం ఇబ్బందులకు గురిచేయడంతో  తాము తీవ్ర మనోవేదన చేందుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల  పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.


logo