గురువారం 04 జూన్ 2020
Vikarabad - Jan 25, 2020 , 00:09:00

ప్రజలకు అందుబాటులో ఉంటూ విధులు నిర్వహించాలి

ప్రజలకు అందుబాటులో ఉంటూ విధులు నిర్వహించాలి


పూడూరు : గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్యులు అందుబాటులో ఉంటూ విధులు నిర్వహించాలని జిల్లా వైద్యాధికారి దశరథ్‌ పేర్కొన్నారు. శుక్రవారం పూడూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలోని సిబ్బం ది రికార్డులను, మందుల స్టాక్‌, పరిసరాలను పరిశీలించారు. వైద్యులు ప్రతి సబ్‌ సెంటర్‌లో ఎన్‌ఎంలు, ఆశవర్కర్లు సక్రమంగా విదులు నిర్వహించేలా చూడాలని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు నిరు పేద ప్రజలు అధికంగా వస్తారని వారికి సరైన వైద్య సేవలు అందజేయాలని సూచించారు. సమయానికి దవాఖానకు హాజరు కాని సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గర్బిణులను, బాలెంతలను ఎప్పటికప్పుడు వైద్యపరిక్షలు చేయాలన్నారు. పీఏసీఎస్‌ సొసైటీ చైర్మన్‌ నర్సింహరెడ్డి, ఉప సర్పంచ్‌ రాజేందర్‌లు జిల్లా వైద్యాధికారితో మాట్లాడుతూ కొన్ని సంవత్సరాల క్రితం నిర్మించిన సిబ్బంది ఉండే గదులు పూర్తిగా శిథిలావస్థలో ఉన్నాయని వాటిని తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆయన దృష్టికి తీసుకు వచ్చారు. దవాఖాన చుట్టూ ప్రహారి లేక హరితహారం ద్వారా మొక్కలు నాటిన ఉండడం లేదని సిబ్బంది ఆయన దృష్టికి తెచ్చారు. ప్రహారి గోడ నిర్మా ణం కోసం చేవెళ్ల ఎంపి డా. రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డిలను నిధులు కోరనున్నట్లు  సొసైటీ చైర్మన్‌  నర్సింహరెడ్డి, ఉప సర్పంచ్‌ రాజేందర్‌లు పేర్కొన్నారు. పూడూరు పీహెచ్‌సీ చుట్టు ప్రహారి నిర్మాణం చేసేందుకు నిధుల కోసం ప్రజాప్రతినిధుల, కల్లెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. వీరితో పాటు డాక్టర్‌ శ్రీధర్‌రెడ్డి, వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.logo