శుక్రవారం 05 జూన్ 2020
Vikarabad - Jan 25, 2020 , 00:08:16

ఈత చెట్లు నరికిన వ్యక్తిపై చర్యలు

ఈత చెట్లు నరికిన వ్యక్తిపై చర్యలు


కులకచర్ల : ఈత చెట్లు నరికి వేసిన వ్యక్తిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్‌ అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ మల్లారెడ్డి అన్నారు. శుక్రవా రం కులకచర్ల మండల పరిధిలోని కాళమ్మ దగ్గర కులకచర్ల గ్రామానికి చెందిన రైతు బొందె ల మాదేవులు సర్వే నెంబర్‌ 569లో తన రెండు ఎకరాల పొలంలో ఉన్న ఈత చెట్లు పూర్తిగా నరికి వేయడంతో గీతా కార్మికులు ఎక్సైజ్‌ అధికారులను సమాచారం అందించారు. గీతాకార్మికుల ఫిర్యా దు మేరకు ఎక్సైజ్‌ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని ఎన్నిచెట్లు నరికి వేతకు గురయ్యాయని పరిశీలించారు. దీంతో 65 తాటి చెట్లు నరికి వేసినట్టు గుర్తించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గీతా కార్మికులకు జీవనోపాధి కలిగించేవి నరికి వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి కల్పించే చెట్లు ఎవరి పట్టాపొలంలో ఉన్నా సరే కాని వాటిని నరికి వేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అనుమతి లేనిదే ఏ చెట్టును కూడా నరికి వేయడానికి ఎవరికి అధికారం లేదని తెలిపారు. గీతాకార్మికుల ఉపాధి చూపుతున్న ఈత చెట్లు ధ్వంసం చేసిన రైతుపై చట్టరిత్యా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎక్సైజ్‌ సీఐ చంద్రశేఖర్‌, ఎస్సై, సిబ్బంది, గీతా కార్మికులు పాల్గొన్నారు.


logo